twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫొటోలు : రానా తో కలిసి హాట్ గా శ్రేయ, పూజా హేడ్గే, అదాశర్మ

    By Srikanya
    |

    హైదరాబాద్ : తెలుగు,తమిళ, కన్నడ, మళయాళ చిత్ర పరిశ్రమలు కలిసి చేసే సినిమా వేడుక సైమా అవార్డ్స్. ఈ సారి నాలుగోసారి అవార్డ్ ల వేడుక జరుగుతోంది. ఈ సందర్బంగా హైదరాబాద్ లో మీడియా సమావేసం ఏర్పాటు చేసారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    దక్షిణాదికి చెందిన నాలుగు సినీ పరిశ్రమలు కలిసి ఈ వేడుకను నిర్వహించటం చాలా హ్యాపీగా ఉందని ఈ ప్రెస్ మీట్ లో అన్నారు. ఈ వేడకకు దుబాయ్ అతిధ్యం ఇవ్వడంలో అంతర్జాతీయంగా మనకు మంచి గుర్తింపు వస్తుందని అన్నారు.

    'సైమా' (సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌) నాలుగో పురస్కారాల వేడుకను వచ్చే నెల 6, 7 తేదీల్లో దుబాయ్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 'సైమా' విశేషాలను బుధవారం రాత్రి హైదరాబాద్‌లో తెలియచేసారు.

    స్లైడ్ షోలో ఆ విశేషాలు ఫొటోలతో కలిసి...

    హీరో రానా మాట్లాడుతూ

    హీరో రానా మాట్లాడుతూ

    ''నాలుగు దక్షిణాది చిత్ర పరిశ్రమలు అంతర్జాతీయ స్థాయిలో పురస్కార వేడుక జరుపుకుంటున్నాయి. 'సైమా'లో పాల్గొనడం ఓ మధురమైన జ్ఞాపకం.

    ఈ సారి....

    ఈ సారి....

    రానా మాట్లాడుతూ... నాలుగు భాషల నుంచి అద్భుతమైన చిత్రాలొచ్చాయి. వేడుక మరింత ఘనంగా జరగబోతోంది''అన్నారు.

    ఉత్తమ నటుడుగా ఎవరైతే...

    ఉత్తమ నటుడుగా ఎవరైతే...

    ఎంపికైతే బాగుంటుంది అన్న ప్రశ్నకు ''పోటీలో లేకపోయినా అక్కినేని నాగేశ్వరరావుగారికి పురస్కారం ఇవ్వడమే సముచితమని భావిస్తున్నా''నని చెప్పారు రానా.

    వెంకటేష్‌, నాగచైతన్య కూడా పోటీలో ఉన్నారు కదా...?

    వెంకటేష్‌, నాగచైతన్య కూడా పోటీలో ఉన్నారు కదా...?

    అని అడగ్గా ''వెంకటేష్‌గారికి చాలా అవార్డులొచ్చాయి. ఒకవేళ ఆయనకు 'సైమా' పురస్కారం వస్తే దాన్ని నేనే తీసుకురావాల్సి ఉంటుంది. అందుకే నాగచైతన్యకు వస్తే బాగుంటుంది అనుకుంటున్నా'' అని సమాధానం ఇచ్చారు రానా.

    శ్రియ చెబుతూ....

    శ్రియ చెబుతూ....

    ''సైమా పురస్కారాల వేడుకతో నాకెన్నో జ్ఞాపకాలున్నాయి. ప్రతిసారీ ఆ వేడుకలో పాల్గొంటున్నా.

    అలాగే...

    అలాగే...

    రెండు రోజుల పాటు సహ నటులతో కలిసి సందడి చేయడం ఓ చక్కటి అనుభూతి అన్నారు.

    అప్పుడు ఆనందం...

    అప్పుడు ఆనందం...

    ఇది వరకు దర్శకుడు శంకర్‌, నటి శ్రీదేవి సమక్షంలో వాళ్ల చిత్రాల్లోని పాటలకు డాన్స్‌ చేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది''అని చెప్పింది.

    పూజ హెగ్డే మాట్లాడుతూ...

    పూజ హెగ్డే మాట్లాడుతూ...

    ''నేను తొలిసారి ఓ వేదికపై ప్రదర్శన ఇవ్వబోతున్నాను. అది 'సైమా' వేడుక కావడం సంతోషమ''ని చెప్పింది పూజా హెగ్డే.

    సైమా ఛైర్‌పర్సన్‌ బృందా ప్రసాద్‌ మాట్లాడుతూ.....

    సైమా ఛైర్‌పర్సన్‌ బృందా ప్రసాద్‌ మాట్లాడుతూ.....

    ''సైమా' అతి పెద్ద పురస్కార వేడుకగా మారింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలన్నింటినీ ఒకతాటిపైకి తీసుకొస్తుంది. ఎప్పుడులేని విధంగా ఈ సారి 20మంది తారలతో ప్రదర్శనలు ఉంటాయి''అన్నారు.

     ఈ కార్యక్రమంలో ...

    ఈ కార్యక్రమంలో ...

    కృతి కర్బంద, ఆదా శర్మ, షర్మిలా మాండ్రే, సైమా మార్కెటింగ్‌ డైరెక్టర్‌ తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    ఇప్పటికే...

    ఇప్పటికే...

    ఇటీవల సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల నామినేషన్స్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ అవార్డులకు సంబంధించి బెస్ట్ యాక్టర్ రేసులో అసలు మహేష్ బాబు పేరు లేక పోవడం పలువురు అభిమానులను ఆశ్చర్య పోయేలా చేసింది.

    ఆశ్చర్యం

    ఆశ్చర్యం

    ‘1-నేనొక్కడినే' సినిమాలో మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అలాంటిది ఆయన పేరు కనీసం నామినేషన్స్ లిస్టులో లేక పోవడం ఇటీవల చర్చనీయాంశం అయింది.

    అయితే ....

    అయితే ....

    తాజాగా విడుదలైన సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా) 2015 నామినేషన్ల లిస్టులో ఉత్తమ నటుడి కేటగిరీలో మహేష్ బాబు కూడా నిమినేట్ అయ్యారు.

    అందులో..

    అందులో..

    వివిధ అంశాలకు సంబంధించిన నామినేషన్స్ లిస్టు విడుదల చేసారు. ‘మనం', ‘రేసు గుర్రం' చిత్రాలు 11 నామినేషన్లతో టాప్ లో ఉన్నాయి.

    ఇదే...

    ఇదే...

    సినిమా పరిశ్రమకు సంబంధించి సౌత్ ఇండియాలో ఇదే అతి పెద్ద అవార్డుల కార్యక్రమం.

    మొదలయ్యింది

    మొదలయ్యింది

    జూన్ 18 నుండి ఓటింగ్ మొదలు అయ్యిది. ఆగస్టు 6, 7 తేదీల్లో దుబాయ్ లో అవార్డుల వేడుక జరుగనుంది

     హాట్ గా...

    హాట్ గా...

    ఈ ప్రెస్ మీట్ లో ..కృతి కర్బంగా చాలా హాట్ గా కనిపించింది.

    రానా నే సెంటర్ ఎట్రాక్షన్

    రానా నే సెంటర్ ఎట్రాక్షన్

    ఈ పంక్షన్ లో బాహుబలిలో విలన్ గా చేస్తున్న రానా సెంటర్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

    పూజ హేడ్గే

    పూజ హేడ్గే

    ఈ ప్రెస్ మీట్ కు పూజ హేడ్గే ప్రత్యేకంగా రెడీ అయ్యి వచ్చింది.

    సెల్ఫీ

    సెల్ఫీ

    ఈ ప్రెస్ మీట్ లో సెటరాఫ్ ఎట్రాక్షన్ గా తీసుకున్న సెల్ఫీ నిలిచింది.

    English summary
    The 4th edition of South Indian International movie awards, the most awaited film awards of south india will be held in dubai this year. SIIMA enjoys the highest popularity in south india with 45 % of south indian tv viewers watching SIIMA every year. Rana Daggubati and actresses such as Shriya, Kriti Kharbanda, Pooja Hedge, Adah Sharma and Sharmila Mandre graced the press conference of South India International Movie Awards (SIIMA) 2015 Yesterday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X