సినీ తారల కల్యాణ వైభోగం 2011
తెలుగు సినీ పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓకే ఏడాది చాలా మంది స్టార్స్ ఓ ఇంటి వారయ్యారు. తెలుగునాటే కాదు, సౌతిండియాలోని ఇతర సినీ రంగాలకు చెందిన తారల వివాహాలు కూడా ఈ ఏడాదే జరిగాయి. టాలీవుడ్ టాప్ యువ స్టార్లు జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వివాహాలు ఈ ఏడేది జరుగగా...మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నిశ్చితార్థం కూడా పూర్తయింది.
అల్లు అర్జున్ తన స్నేహితురాలు స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో వీళ్ల పెళ్లికి తొలుత కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యాయనే వార్తలు వినిపించినప్పటికీ...చివరకు ఇరు కుటుంబాల వారి పెద్దల అంగీకారంతో మార్చి 6న అంగరంగ వైభవంగా వీరిద్దరి పెళ్లి గ్రాండ్ గా జరిగింది.
ఇక జూనియర్ ఎన్టీఆర్ తన బంధువుల అమ్మాయి లక్ష్మిప్రణతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ నందమూరి చిన్నోడి పెళ్లి అభిమానులు కలకాలం గుర్తుంచుకునేలా మే6న భారీ వేడుకగా జరిగింది.
రామ్ చరణ్ తేజ్, ఉపాసన కామినేని పెళ్లి కూడా ఈ సంవత్సరమే ఖరారైంది. డిసెంబర్ 1న నిశ్చితార్థం కూడా పూర్తయింది. వచ్చే ఏడాది వీరి పిళ్లి జరిగే అవకాశం ఉంది.
తెలుగులో పలు సినిమాల్లో నటించిన నవనీత్ కౌర్ మహారాష్ట్ర కు చెందిన రాజకీయ నాయకుడు రవి రాణాను పెళ్లాడింది. మలయాళం సూపర్ స్టార్ పృథ్వి రాజ్ వివాహం సుప్రియతో ఏప్రిల్ 25న జరిగింది.
రతి నిర్వేదం సినిమాలో హీరోయిన్, రాజన్న సినిమాలో దొరసాని పాత్ర పోషించిన శ్వేతమీనన్ తన బాయ్ ఫ్రెండ్ శ్రీవాల్సన్ జె మీనన్ ను జూన్ 18న వివాహమాడింది.
అదే విధంగా యుగానికొక్కడు సినిమా ద్వారా మనకు సుపరిచితం అయిన కార్తీ వివాహం పెద్దలు ఎంపిక చేసిన రంజీని అనే అమ్మాయితో జరిగింది. అదే విధంగా తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ తన గర్ల్ ఫ్రెండ్ గీతాంజలిని పెళ్లి చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications











