హజారే పోరాటానికి సౌత్ సినీస్టార్ మద్దతు
భారత్ అవినీతి రహిత దేశంగా మారాలంటే బలమైన 'జన లోక్ బిల్లు" రావాలనే డిమాండ్ తో పోరాటం చేస్తున్న సామాజిక వేత్త అన్నా హజారేకు సౌతిండియన్ సినీ స్టార్స్ మద్దతు ప్రకటించారు. అభిమానులు కూడా హజారే పోరాటానికి బాసటగా నిలవాలని కోరుతూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల ద్వారా పిలుపునిస్తున్నారు.
'రేపటి ప్రకాశవంతమైన, అవినీతి రహిత భారత దేశాన్ని చూడాలంటే...ఈ రోజే అన్నా హజారే పోరాటానికి మద్దతు ఇవ్వండి" అని అక్కినేని నాగార్జున తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రజా ధనాన్ని దోచుకు తింటున్న రాజకీయ నాయకులు, అధికారుల భరతం పట్టేందుకు, అన్నాకు అండగా నిలవాలని దర్శకుడు రమేష్ అరవింద్ కోరారు. అన్నాకు మరింత ప్రజా శక్తి చేకూరాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు హీరోయిన్ రమ్య తెలిపింది. తెలుగు పాప్ సింగర్ స్మిత కూడా ట్వట్టర్ ద్వారా హజారే ఉద్యమానికి సపోర్టు ఇచ్చింది. వీరి దారిలోనే మరి కొందరు సీనీ తారలు ట్విట్టర్-ఫేస్ బుక్ ద్వారా అభిమానుల్లో చైతన్యం తెస్తున్నారు.


Click it and Unblock the Notifications











