twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విషాదం.. యువ నటి ఆత్మహత్య.. ఎమోషనల్​గా సూసైడ్​ నోట్​

    |

    ఈ మధ్య కాలంలో సూసైడ్ చేసుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. అందులోని సినీ నటీనటులు ఉండటం బాధ కలిగిస్తోంది. అనారోగ్య సమస్యలు, యాక్సిడెంట్లతో చనిపోతుంటే మరికొందరు ఆత్మహత్యలు చేసుకుని తనువు చాలిస్తున్నారు. సినీ రంగం ఒక రంగుల ప్రపంచం. అందులో ఆఫర్లు రాక కొందరు, డిప్రెషన్​తో మరికొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. బాలీవుడ్​ హీరో, దివంగత సుశాంత్ సింగ్​ రాజ్​పుత్ సూసైడ్ చేసుకోవడం సెన్సేషన్​ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఒక నటి డిప్రెషన్​తో అనంతలోకాలకు వెళ్లిపోయింది.

    అసలు నిజాలు..

    అసలు నిజాలు..

    సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సూసైడ్ చేసుకుని తనువు చాలించారు. క్రమంగా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు. టాలీవుడ్​లో ఉదయ్​ కిరణ్​ నుంచి బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ వరకు అనేక మంది నటీనటులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి ఆత్మహత్యలకు అనేక కారణాలు వినిపిస్తున్న అసలు నిజాలు మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు.

    ఎమోషనల్​ నోట్..

    ఎమోషనల్​ నోట్..

    అయితే తాజాగా సౌత్ కొరియాకు చెందిన నటి యో జూ యూన్ (27)​ బలవన్మరణానికి పాల్పడింది. ఆగస్టు 29న డిప్రెషన్​ కారణంగా ఆత్మహత్యకు చేసుకుంటున్నట్లు తెలిపింది. మరో దిక్క లేక చనిపోతున్నానంటూ యో జూ రాసిన ఎమోషనల్​ నోట్​ ఉద్వేగంగా ఉంది.

    ముందుగా వెళ్తున్నందుకు..

    ముందుగా వెళ్తున్నందుకు..

    ఇండస్ట్రీలో బతకడం అంత సులభం కాదని ఆమె లెటర్​లె చెప్పిన మాటలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ''మీ అందరికంటే ముందుగా నేను వెళ్లిపోతున్నందుకు నన్ను క్షమించండి. ముఖ్యంగా అమ్మ, నాన్న, నానమ్మ, అన్నయ్యకు నా సారీ. జీవించాలని లేదంటూ నా మనసు ఎప్పుడూ ఆవేదన చెందింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా.

    వెలితిగా ఉంటుందని తెలుసు..

    వెలితిగా ఉంటుందని తెలుసు..

    ఇప్పుడు నేను ఎంతో ప్రశాంతగా ఉన్నా. ఎందుకంటే నేను ఎప్పటినుంచే అనుకుంటుంది ఇదే కదా. నేను లేని మీ లైఫ్​ వెలితిగా ఉంటుందని తెలుసు. అయినా ధైర్యంగా జీవించేందుకు ట్రై చేయండి. నేను మిమ్మల్ని పైనుంచి చూస్తూనే ఉంటాను. దయచేసి నాకోసం ఏడవకండి.

    ఎవరినీ నిందించకండి..

    ఎవరినీ నిందించకండి..

    ఇప్పటివరకు అర్హతకు మించి ఆనందకర జీవితాన్ని గడిపాను. అందుకే నా ఈ జీవితం చాలు అని అనిపించింది. కాబట్టి నా విషయంలో ఎవరిని నిందించకండి. మీరు సంతోషంగా ఉండండి. నేను చనిపోలేదు. మీతోనే ఉన్నాను'' అని రాసుకొచ్చింది యో జూ యూన్​. అలాగే ''నాకు నటించాలనే కోరిక ఎంతో బలంగా ఉండేది. ఒకవేళ అది నాలో ఒక పార్ట్​ అనుకుంటా. కానీ ఆ లైఫ్​ అంత సులభం కాదు. నాకు ఇంకేమీ చేయాలని లేదు. అదే నాకు నిరాశ. మనకు నచ్చింది చేయాలనుకోవడం వరమే కానీ, అది మాత్రమే చేయాలనుకోవడం శాపం'' అని యో జా యూన్​ తెలిపింది.

    English summary
    South Korean Young Actress Yoo Joo Eun Gets Suicide AT 27 Age. And Leaves A Suicide Note.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X