స్టైలిష్ జూ ఎన్టీఆర్ కి 'సౌత్ స్కోప్ స్టైల్' అవార్డు!!

By Sindhu

అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ ప్రారంభించిన 'సౌత్ స్కోప్' ఆంగ్ల సినీ మాస పత్రిక తరపున 2007-2008 సంవత్సరానికి గాను తొలి 'సౌత్ స్కోప్ స్టైల్' అవార్డుల ప్రదానం హైద్రాబాద్ లోని నోవాటెల్ లో ఆదివారం సాయంత్రం కన్నులపండువగా జరిగింది. తొలిసారిగా ఇచ్చిన అవార్డుల్లో స్టైలిష్ యాక్టర్ గా జూ ఎన్టీఆర్ నటించిన 'కంత్రి" చిత్రంలో న్యూ లుక్ తో అలరించినందుకుగాను ఈ అవార్డును ప్రభుదేవా దంపతుల చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. వీరి సమక్షంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమలకు చెందిన నటీనుటుల, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ నాలుగు భాషల్లో ప్రేక్షకాదరణ పొందిన సినిమాలను ఎంపిక చేసుకుని ఆవార్డులు బహూకరించారు. టివి-9 స్పాన్సర్ చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఆర్పి అధినేత చిరంజీవి సతీసమేతంగా హాజరయ్యారు. వెంకటేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అరవింద్, తరుణ్, ఆర్య, భరత్, ధనుష్, విమాలారామన్, శ్రద్ధాదాస్, గౌరీ ముంజల్, ముమైత్ ఖాన్, వి.వి.వినాయక్, క్రిష్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలుగులో స్టైలిష్ ఫిల్మ్ గా మహేష్ బాబు నటించిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'అతిథి' ఎంపికైంది. తెలుగులో స్టైలిష్ హీరోయిన్ గా ఇలియానా (జల్సా) ప్రభుదేవా దంపతుల చేతుల మీదుగా ఈ అవార్డు అందుకుంది. తమిళ స్టైలిష్ హీరో అవార్డును ధనుష్ (పొల్లధావన్), స్టైలిష్ హీరోయిన్ అవార్డును శ్రియ (శివాజీ) అందుకున్నారు. కన్నడ స్టైలిష్ హీరోగా పునీత్ రాజ్ కుమార్ కు అవార్డు అందజేశారు. మలయాళంలో స్టైలిష్ హీరోగా మమ్ముట్టి ఎంపికయ్యారు. ఆయన తరఫున లక్ష్మీరాయ్ ఈ అవార్డును మహమ్మద్ అజారుద్దీన్ చేతుల మీదుగా అందుకున్నారు. 'సౌత్ స్కోప్ యూత్ స్టైల్ ఐకాన్' అవార్డును సూర్య కు ప్రకటించారు. ఆయన తరఫున ధనుష్ హీరో వెంకటేష్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. 'సౌత్ స్కోప్ యూత్ స్టైల్ ఐకాన్' ఫిమేల్ అవార్డు నయనతారను వరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X