హీరోయిన్లతో కలిసి రజనీ, చిరంజీవి, బాలయ్య 2015 పార్టీ!

By Bojja Kumar

హైదరాబాద్: సౌతిండియా స్టార్స్ రజనీకాంత్, చిరంజీవి, బాలయ్య లాంటి స్టార్స్ అంతా కలిసి పార్టీ చేసుకోబోతున్నారు. వీళ్లు మాత్రమే కాదు వీరితో పలువురు హీరోయిన్లు కూడా ఈ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. 1980, 90 దశకంలో సౌత్ సినీ పరివ్రమను ఓ ఊపు ఊపిన స్టార్స్ అంతా ఈ పార్టీలో జాయిన్ కాబోతున్నారు.

సుహాసిని మణిరత్నం ఐదేగేళ్ల క్రితం 80వ, 90వ దశకంలో సౌత్ సినిమా పరిశ్రమలో స్టార్స్‌గా రాణించిన వారందరినీ ఒక గ్రూపుగా ఏర్పరిచి.....ప్రతి ఏడాది గెట్ టు గెదర్ ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అంతా ఓ వారం పాటు కుటుంబాన్ని తమ తోటి స్టార్స్ తో కలిసి జాలీగా గడపుతారు. గతేడాది ఈ పార్టీని మోహన్ లాల్ హోస్ట్ చేసారు.

South Stars reunion For 2015

ఈ గెట్ టు గెదర్ గత ఐదేగేళ్ల నుంచీ బ్రేక్ లేకుండా జరగుతుండడం విశేషం. మొదట ఇది 2009లో చెన్నయ్ లో ఓ పెళ్లి వేడుకల్లో కొంత మందితో ప్రారంభమయ్యింది. రెండో ఏడాది చెన్నయ్ లో కలవగా మూడోసారి చిరంజీవి నివాసంలో కలిశారు. ఆ తర్వాత బెంగళూరులోని అంబరీష్, సుమలత నివాసంలో కలిశారు. గతేడాది మోహన్‌లాల్ ఇంట్లో ఈ తారల కలయిక జరిగింది.

తమ వ్యక్తి గత హోదాలు పక్కన పెట్టి ఇలా జాలీగా గడపడం నిజంగా ఒక అరుదైన సంఘటన. ఇది చూసిన వారికి మహా అద్భుతం అనిపిస్తుంది. అభిమానులకు కన్నుల విందులా ఉంటుంది. ప్రేక్షకులకు ఆనందంగా ఉంటుంది. తమ బిజీ లైఫ్ కాస్త పక్కన పెట్టి గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకొని అందరూ ఒకచోట చేరి తమ అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు.

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, సుమన్, నరేష్, రజనీకాంత్, అర్జున్, భాను చందర్, మోహన్ లాల్, రమేష్ అరవింద్, అంబరీష్, జయరామ్, హీరోయిన్లు రాధ, రమ్యకృష్ణ, సుహాసిని, ఖుష్బు, జయశ్రీ, రేవతి, నదియా, మేనక, పూర్ణిమా భాగ్యరాజ్, లిజి సుమలత, సరిత ఇలా దాదాపు 30 మంది స్టార్స్ గతేడాది పాల్గొన్నారు. గతేడాది మిస్సయిన్ కమల్ హాసన్ ఈ సారి వేడుకల్లో పాల్గొంటారు. మరి ఈ సారి ఎవరు ఈ పార్టీ ఏర్పాటు చేస్తున్నారనేది ఆసక్తిగా మారింది. ఈ పార్టీకి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. స్టార్స్ ఒంటరిగా రావాలి. చివరికి భార్యలను, భర్తలను సైతం దూరం పెట్టాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X