ఐపిఎల్ మ్యాచ్ లో బాయ్ ఫ్రెండ్ తో మీడియాకు చిక్కిన రమ్య...
కర్నాటక సినీ పరిశ్రమలో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నటి రమ్య, కన్నడసినీ రంగంలో నెంబర్ వన్ స్టార్ గా వెలుగొందుతోంది. రమ్య(దివ్య స్పందన). రీసెంట్ గా కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి ఒక్క సంవత్సరం పాటు ఏ కన్నడ సినిమాలోనూ నటించరాదని బ్యాన్ చేశారనే వార్తలు వచ్చిన విషయం విధితమే. దాని తర్వాత పలు యాడ్స్ లో నటించింది. కాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శనివారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్ సిబీ)కోల్ కతా నైట్ రైడర్స్ (కెకెఆర్)మధ్య జరిగిన టీ20 మ్యాచ్ అనంతరం ఆ జట్ల యజమానులు ఉల్లాసంగా కాసేపు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు.
ప్రేక్షకులు వెళ్లిపోయాక మ్యాచ్ శనివారం రాత్రి 12గంటలవరకు జరిగిన ఈ మ్యాచ్ ని వివిఐపిలు మాత్రమే చూశారు. కన్నడ తార రమ్య తన బాయ్ ఫ్రెండ్ తో కలసి మ్యాచ్ తిలకించారు. ఆ బాయ్ ఫ్రెండ్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ వస్త్రవ్యాపారి కుమారుడని, ఇంకా స్విడ్జర్లాడ్, ప్రోచ్యుగల్ తదితర దేశాలతో వ్యాపార ససత్సంబందాలు మెండుగా ఉన్నాయని శాండిల్ వుడ్ లో వదంతులున్నాయి.. ఈ సందర్బంగా మీడియాతో రమ్య ముచ్చటిస్తూ తన బాయ్ ఫ్రెండ్ రాఫెల్ ని అనుకోకుండా ఒక పార్టీలో కలిశామని, తను తన ఫాదర్ కంపెనీలో సిఈఓగా ఉన్నారని చెప్పింది. పెళ్ళి గురించి చెబుతూ మ్యారేజ్ ప్రపోజల్ గురించి ఇంకా ఏమి మాట్లాడుకోలేదని. అయితే రాఫెల్ 15డేస్ నుండి బెంగళూరు సిటిలో తన బిజినెస్ పరంగా వచ్చారని చెప్పింది. ప్రస్తుతం తను మళియాలి సినిమాలో నటిస్తూ బిజిగా ఉంది, ఇంకా రెండు మూడు ప్రొజెక్ట్స్ అగ్రిమెంట్ చేసుకొన్నదని సో ఈ సంవత్సరంలో తన ప్రాజెక్ట్స్ ను పూర్తి చేసుకొని వచ్చే సంవత్సరంలో వివాహా చేసుకోవచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications











