మోహన్ లాల్ ని హాస్పటిల్ లో జాయిన్ చేసారు
హైదరాబాద్ : మళయాళ సూపర్ స్టార్ మోహల్ లాల్ హాస్పటిల్ లో జాయిన్ అయ్యారు. ఆయన కాలు నెప్పితో గత నాలుగు రోజులుగా భాధ పడుతున్నారు. దాంతో వెంటనే ఆయన హాస్పటిల్ కి వెళ్లారు. అక్కడ డాక్టర్స్ కు పరీక్షించి స్పాండిలైటిస్ అని తేల్చినట్లు సమాచారం.
గతంలో మోహన్ లాల్ ని ఈ విషయమై డాక్టర్లు హెచ్చరించినా నెగ్లెట్ చేసారని అంటున్నారు. బిజీ షెడ్యూల్స్ తో ఆయన ట్రీట్ మెంట్ కు వెళ్లలేకపోయారని, ఇప్పుడు అదే ఎక్కవై హాస్పటిల్ లో జాయిన్ అవ్వాల్సి వచ్చిందని చెప్తున్నారు. సర్జీరి సజెస్ట్ చేసినట్లు సమాచారం. అలాగే హాస్పటిల్ నుంచి వెళ్లాక బెడ్ రెస్ట్ తప్పనిసరి అని చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక ట్రీట్ మెంట్ కు మోహన్ లాల్ శరీర్ బాగా స్పందిస్తోందని, త్వరలోనే హాస్పటిల్ నుంచి డిశ్చార్జ్ అవుతారని తెలుస్తోంది. ఆయన ఒప్పుకున్న ప్రాజెక్టులు చాలా ఉండటంతో దర్శక,నిర్మాతలు టెన్షన్ గా ఎదురుచూస్తున్నారు. ఆయన డేట్స్ చాలా వరకూ డిస్ట్రబ్ అవుతాయని, కానీ ఆయన ఆరోగ్యంగా ఉత్సాహంగా పాల్గొంటేనే షూటింగ్ చేయగలుగుతామని అంటున్నారు. త్వరగా కోలుకోవాలని వన్ ఇండియా తెలుగు కోరుకుంటోంది.


Click it and Unblock the Notifications











