twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కృష్ణతో వివాదం గురించి ఎస్పీ బాలు

    By Srikanya
    |

    సూపర్ స్టార్ కృష్ణతో ఎస్పీ బాల సుబ్రమణ్యంకు గతంలో వివాదం,మనస్పర్దలు చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాలను నిన్న(ఆదివారం)రాత్రి ఓ తెలుగు టీవీ ఛానెల్ పోగ్రామ్ లో మాట్లాడుతూ ఎస్పీ బాలు వివరించారు. ఆయన మాటల్లోనే...ఒక సంస్థనుంచి నాలుగైదేళ్లయినా బకాయిలు రాకపోవడంతో, ఫోన్ చేసి నిర్మాతను అడిగాను. దురుసుగా మాట్లాడారు. దాంతో నేను ఫోన్ పెట్టేశాను. ఆ తరువాత కృష్ణ ఫోన్ చేసి, "మీరు పాడకపోతే నా సినిమాలు రిలీజ్ కావన్నారట.. మీ డబ్బులు వెంటనే పంపుతాను. మీ తరఫున మిత్రుడొకరు నాకు 20వేలు బకాయి ఉన్నారు కదా? అది వెంటనే పంపండి'' అని ఫోన్ పెట్టేశారు.

    ఆయన చెక్కు పంపారు. నేను కూడా 20వేలు పంపేశాను. రెండు, మూడేళ్లు ఇద్దరం కలిసి పనిచేయలేదు. ఆ తర్వాత వేటూరి మమ్మల్ని కలిపే ప్రయత్నం చేశారు. నేను పద్మాలయ ఆఫీసుకు వెళ్లి గతంలో జరిగినదాని గురించి కృష్ణకు వివరించబోగా.. "అదంతా మరచిపోండి, మళ్లీ కలిసిపనిచేద్దాం'' అన్నారు అని చెప్పారు. ఇక ఆ తర్వాత ఆయన్ని దెబ్బతీసేందుకు మీరు చక్రవర్తిని ప్రోత్సహించారని రామకృష్ణ అన్నారు. దీనికి మీ సమాధానమేమిటి అంటే...పేపర్లో చదివాను. ఇలాంటి వాటిమీద కామెంట్ చేయను. రామకృష్ణ నాకు తమ్ముడులాంటి వాడు. నిజమేమిటో అతడికి తెలుసు, నాకు తెలుసు, పరిశ్రమకు తెలుసు అని చెప్పారు. ఇక సినిమారంగంలో కులం పాత్ర గురించి చెపుతూ..ఈ రంగంలో కులగజ్జి పెరిగిపోయింది. కులాలపేర్లన్నీ బయటికి వచ్చేశాయి. నిర్మాతలకు గౌరవం లేదు అని తేల్చి చెప్పారు.

    English summary
    
 Star Singar S.P.Balu said thay he was having some issues with Krishna at that time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X