బస్సు కింద పడిపో అంటే పడిపోతారు, ఆ భాష వాళ్ళకు నేనంటే అంత ప్రాణం: SPB కంటతడి
సంగీత ప్రపంచంలో 40వేల పాటలు పాడటం అంటే భవిష్యత్తు తారలకు సాధ్యమయ్యే పని కాదు. ఘంటసాల తరువాత ఇండియన్ హిస్టరిలో బాలు గారు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. గాన గాంధర్వ అనే పదానికి నిలువెత్తు నిదర్శనమనే చెప్పాలి. భారతదేశంలోని ప్రతి భాష కూడా ఆయన గొంతు మాధుర్యాన్ని చూసింది. దాదాపు 13కు పైగా భారతీయ భాషలలో ఆయన పాటలు పాడారు.

అంధరికంటే ఎక్కువగా వాళ్ళే బాధపడుతున్నారు
ఇక ఆయన లేరు అనగానే అన్ని భాషల వాళ్ళు తమ ఇంట్లో మనిషి వెళ్లిపోయారు అనేంతల బాధపడుతున్నారు. ఇక SPB అంటే తెలుగు వారికి అమితమైన అభిమానం కావచ్చు. కానీ అంతకంటే ఎక్కువగా కన్నడ భాషలో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు అందరికంటే ఆ రాష్ట్ర ప్రజలు ఎక్కువగా బాధపడుతున్నారు. పేక గతంలో వారు చూపించే ప్రేమకు చాలా సార్లు కన్నీళ్లు పెట్టుకున్నట్లు బాలు చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు.

అంత ప్రాణంగా అభిమానిస్తారు
ఒక ఇంటర్వ్యూలో కన్నడ ప్రజల గురించి మాట్లాడుతూ.. అన్ని భాషల వారు నన్ను అమితంగా ప్రేమిస్తారు. తెలుగు వాన్ని కాబట్టి మనవాళ్ల అభిమానం గురించి తెలిసిందే. కానీ ఏ సంబంధం లేకుండా నేను కర్ణాటకలో ఎక్కడికైనా వెళితే జనాలు కొన్ని కిలోమీటర్ల వరకు బారులు తీరుతారు. కొందరు వ్యక్తులు ఎంతగా అభిమాణిస్తారంటే.. నేను బస్సు కిందకు వెళ్లి పడమన్నా పడతారు. అంత ప్రాణంగా అభిమానిస్తారు.
Recommended Video

ఒక జన్మ సరిపోదు.. మళ్ళీ ఇలానే పుట్టాలి
నిజంగా చాలా గొప్ప జీవితాన్ని ఇచ్చావు భగవంతుడా అనుకుంటాను. ఒకవేళ కుదిరితే మళ్ళీ.బాలసుబ్రహ్మణ్యంగానే పుట్టాలి. నన్ను అభిమానించే ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్లి నమస్కారం చేయలేను కాబట్టి. ఇలాగే పాటలు పాడుతూ వారిని ఎంతగానో అలరించాలి. అందుకు ఒక జన్మ సరిపోదు. నేను ఒక్కడినే కాకుండా నా అభిమానులు కూడా మళ్ళీ పుట్టాలని.అనుకుంటాను.. అని బాలసుబ్రహ్మణ్యం వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











