twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి అస్వస్థత

    By Srikanya
    |

    SP Balasubrahmanyam
    జోహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అస్వస్థతకు గురయ్యారు. భారత్‌, దక్షిణాఫ్రికా దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్న ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ సౌతాఫ్రికా బాలుకు శనివారం రాత్రి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించింది.

    అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన అస్వస్థతకు గురయ్యారు. బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యం పాలవడానికి గల కారణాలేమీ తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన విందు కార్యక్రమాన్ని కూడా రద్దు చేసి, బాలును స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అయితే తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ బాలసుబ్రహ్మణ్యం మీడియా కి ఫోన్‌లో చెప్పారు.

    English summary
    
 SP Balasubrahmanyam fell ill shortly after receiving the inaugural Lifetime Achievement award at a function here last night. Balasubrahmanyam, 67, who was last heard in 'Chennai Express', sang a line each in 15 languages receiving the award at the International Indian Film Festival of South Africa (IIFFSA). Although the nature of his illness was not disclosed, organisers said plans were being made for the singer to return home today. A dinner event, which was supposed to held tonight with him, has also been canceled.
 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X