twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    SP Balasubrahmanyam first death Anniversary: ఇంకా నీ పాట మధురస్మృతుల్లోనే.. మోహన్ లాల్ ఎమోషనల్

    |

    దేశ సినీ, మ్యూజిక్ పరిశ్రమలో గాన గంధర్వుడిగా సంగీత ప్రపంచాన్ని దాదాపు 5 దశాబ్దాలకుపైగా ఊర్రూతలూగించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లేరంటే నమ్మడం కష్టమే. కానీ ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా బాలు పాడిన పాటలు పలు భాషల్లో ఆయనను సజీవ మూర్తిగా మార్చాయి. ఎన్నో వేల పాటలు పాడిన ఎస్పీ బాలు గారు మరణించిన సెప్టెంబర్ 25వ తేదీకి ఏడాది పూర్తయింది. సంగీత ప్రపంచానికి ఆయన అందించిన సేవలు మరోసారి స్మరించుకొంటూ...

    Recommended Video

    SP Balasubrahmanyam : సజీవ మూర్తిగా ఎస్పీ బాలు.. చీకటి వెలుగులతోపాటు | Mohan Lal | Filmibeat Telugu
     కరోనా బారిన పడి తిరిగి రాని లోకాలకు

    కరోనా బారిన పడి తిరిగి రాని లోకాలకు

    గతేడాది దేశాన్ని కరోనావైరస్ పట్టి పీడిస్తున్న సమయంలో ఎస్పీ బాలు ఆ మహమ్మారి బారిన పడ్డారు. వైరస్ నుంచి త్వరగా బయటపడుతానని తన అభిమానులకు, కుటుంబానికి ధైర్యం చెప్పి హాస్పిటల్‌లో చేరారు. అక్కడ ఆయన ఆరోగ్య మరింత క్షీణించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దాంతో యావత్ సంగీత ప్రపంచం విషాదంలో కూరుకుపోయింది.

     బాలు అస్తమించని సంగీత సామ్రాజ్యం

    బాలు అస్తమించని సంగీత సామ్రాజ్యం

    ప్రపంచ సినీ సంగీతంలో ఎస్పీ బాలు అస్తమించని సామ్రాజ్యాన్ని నెలకొల్పాడంటే అందులో ఆశ్చర్యం లేదు. ఈ భూమి మీద ఏదో ఒక సమయంలో బాలు గొంతుక పాట రూపంలో ప్రతీ ఒక్కరి హృదయాలను తట్టి లేపుతుంది. మీ హృదయాల్లో నేను ఉన్నాను అంటూ ప్రేమగా భావోద్వేగానికి గురిచేస్తారు. తన పాటలతో బాలు చేసిన మ్యాజిక్ అదే... అందుకే ప్రపంచవ్యాప్తంగా చీకటి వెలుగులతోపాటు బాలు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటారు.

     బహు భాషా గాయకుడిగా, నటుడిగా

    బహు భాషా గాయకుడిగా, నటుడిగా

    ప్రముఖ సంగీత దిగ్గజం ఎస్పీ కోదండపాణి శిష్యరికంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం 1966లో డిసెంబర్ 15 తేదీన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు పాడారు. 1981లో ఏక్ దూజే కే లియే చిత్రానికి ఆయనకు జాతీయ అవార్డు లభించింది. 1983లో సాగర సంగమం, 1986లో స్వాతిముత్యం, 1988లో రుద్రవీణ చిత్రాలకు జాతీయ అవార్డులు అందుకొన్నారు.

     కమల్, రజనీ, సల్మాన్ ఖాన్‌కు డబ్బింగ్

    కమల్, రజనీ, సల్మాన్ ఖాన్‌కు డబ్బింగ్

    ఎస్పీ బాలసుబ్రమణ్యం గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్‌గా, డబ్బింగ్ హోస్ట్‌గా కాకుండా నటుడిగా అద్బుతమైన పాత్రలు పోషించారు. మన్మధలీలై చిత్రంతో డబ్బింగ్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్, విష్ణువర్ధరణ్, సల్మాన్ ఖాన్, కే భాగ్యరాజా, అనిల్ కపూర్, గిరీష్ కర్నాడ్, జెమిని గణేషన్, అర్జున్ సర్జా, నాగేశ్, కార్తీక్, రఘువరన్ లాంటి ప్రముఖ నటులకు గాత్రదానం చేశారు.

     ఎన్నో వేల పాటలతో

    ఎన్నో వేల పాటలతో

    భారతీయ సంగీత రంగంపై ఎస్పీ బాలు చెరగని సంతకం చేశారు. ఎన్నో వేల పాటలను పాడిన ఎస్పీ బాల తన కెరీర్‌లో ఉత్తమ గాయకుడిగా 6 జాతీయ అవార్డులు అందుకొన్నారు. అలాగే 25 నంది అవార్డులతో రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. తెలుగు సంగీత ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప గాయకుడిగా బాలు చరిత్రలో మిగిలిపోతారు.

    మోహన్ లాల్ ఘన నివాళి..

    సంగీత ప్రపంచానికి విశేష కృషి చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను మొదటి వర్ధంతి రోజున మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గుర్తు చేసుకొన్నారు. మధురమైన గానం, గొంతుకతో ఎప్పుడూ మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మొదటి రోజున ఆయనను గుర్తు చేసుకొంటూ ఆయన నివాళులర్పిస్తున్నాను అని మోహన్ లాల్ ట్వీట్ చేశారు. ఆయన పాడిన బ్రీత్ లెస్ సాంగ్‌ను ముఖ్యంగా తెలుగు పాటను షేర్ చేసి తనను మోహన్ లాల్ గుర్తు చేసుకొన్నారు.

    English summary
    SP Balasubrahmanyam first death Anniversary: Mohan Lal and many film stars rich tribute legendery Singer
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X