మెరుగుపడిన ఎస్పీ బాలు ఆరోగ్యం.. మ్యూజిక్ వింటూ.. పాడేందుకు ప్రయత్నం..
ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందనే వార్తలు అభిమానులు, స్నేహితులు, సన్నిహితులను ఆనందానికి గురిచేశాయి. తన తండ్రి ఆరోగ్యంపై ఎస్పీ చరణ్ తాజాగా వివరాలను అందించారు. వైద్యుల చికిత్సకు తన తండ్రి ఎస్పీ బాలు స్పందిస్తున్నారనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య గురించి వివరాలను వెల్లడిస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో చెప్పిన ప్రకారం..
క్రితం రోజులో కంటే నాన్నగారి ఆరోగ్యం శుక్రవారం మెరుగ్గా ఉంది. ఊపిరితిత్తుల పనితీరు మరింత మెరుగుపడింది. మత్తు ఇవ్వకుండానే చాలా సౌకర్యంగా కనిపించడంపై వైద్యులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నదనడానికి ఇది ముందడుగు అంటూ వైద్యులు చెప్పడంతో మా కుటుంబానికి ధైర్యం కలిగింది. బుధవారం నాన్న ఉన్న గదిలోకి వెళ్లాను. ఆయన నన్ను చూసి సైగలు చేశారు. నాతో ఏదో చెప్పాలని, రాసి చూపించాలని ప్రయత్నం చేశారు. కానీ పెన్ను పట్టుకోవడానికి శక్తి లేకపోవడంతో కష్టమైంది.

తన ఆరోగ్యం ఎలా ఉందని అడిగితే ఓకే అని సైగ చేశారు. ఆరోగ్యం సహకరించినప్పుడు మ్యూజిక్ వింటున్నారు. పాడటానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నదనే విషయానికి అదే సంకేతంగా భావిసున్నాం అని ఎస్పీ చరణ్ పేర్కొన్నారు.
కరోనావైరస్ పాజిటివ్‌తో ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆగస్టు 5వ తేదీన చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్ చేరారు. అనంతరం ఆయన ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్యం మెరుగుపుడుతున్నట్టు వైద్యులు, ఆయన కుమారుడు మీడియాకు సమాచారం అందించారు.


Click it and Unblock the Notifications











