నిలకడగా ఎస్పీ బాలు ఆరోగ్యం.. కానీ ఇంకా విషమంగానే..

ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితిపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతుండటంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి వచ్చిన రూమర్లపై కుమారుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం స్పందించారు.

ఎస్పీ చరణ్ ఓ వీడియోను రిలీజ్ చేసి.. నాన్న ఆరోగ్యం గురించి తన వద్ద నుంచి సమాచారం వస్తే నిజమని నమ్మండి. మిగితా ఎవరైనా ఏదైనా చెబితే వాటి గురించి పట్టించుకోకండి. నాన్న ఆరోగ్య గురించి వైద్యులు ముందు నాకు మాత్రమే చెబుతారు అంటూ ఎస్పీ చరణ్ క్లారిటీ ఇచ్చారు. తన తండ్రి ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు నాతో సోమవారం సాయంత్రం మాట్లాడుతారు. ఆ తర్వాత తాను అధికారికంగా ప్రకటన జారీ చేస్తామని చెప్పారు.

SP Balasubrahmanyam health critical, Still on Vantilator

తాజాగా సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఎంజీఎం హాస్పిటల్ వర్గాలు ఎస్పీ బాలు ఆరోగ్యం గురించి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. కరోనావైరస్ పాజిటివ్‌తో ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎంజీఎం హాస్పిటల్‌లో చేరారు. ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్, ఈసీఎంవో సపోర్ట్‌పై ఐసీయూలో చికిత్స అందిస్తున్నాం. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. బాలు ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందంగా జాగ్రత్తగా అత్యంత సంరక్షణతో పరిశీలిస్తున్నది అని ఎంజీఎం హాస్పిటల్‌ హెల్త్ బులెటిన్‌లో ఉన్నత వైద్యురాలు అనురాధ భాస్కరన్ వెల్లడించారు.

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆగస్టు 5వ తేదీన తనకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతున్నది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అందరూ ప్రార్థించండి అంటూ ఎస్పీ బాలు ఓ వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X