ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం... ఉపరాష్ట్రపతి ఫోన్.. 10 మంది వైద్యులు రంగంలోకి

ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని ఎంజీఎం హాస్పిటల్ వర్గాలు తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఆయనను బతికించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని హాస్పిటల్ వర్గాలు వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం..

బుధవారం రాత్రి నుంచి తీవ్ర జ్వరం

బుధవారం రాత్రి నుంచి తీవ్ర జ్వరం

ఎస్పీ బాలసుబ్రమణ్యం బుధవారం రాత్రి నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఆయనకు ఎక్మో, వెంటిలేటర్ ద్వారా చికిత్సను అందిస్తున్నాం. గత 24 గంటల్లో ఆరోగ్యం క్షీణించింది. క్రమేపీ క్షీణిస్తూనే ఉంది. 24 గంటలు దాటితే గానీ భరోసా ఇవ్వలేమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు అని ఎంజీఎం తన ప్రకటనలో తెలిపింది.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్

ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందనే వార్తను తెలుసుకొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాస్పిటల్ వర్గాలతో మాట్లాడారు. బాలు ఆరోగ్యం గురించి తెలుసుకొన్నారు. మెరుగైన వైద్యులతో చికిత్సను అందించాలని వెంకయ్యనాయుడు సూచించారు.

కమల్ హాసన్ పరామర్శ

కమల్ హాసన్ పరామర్శ

బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి క్షీణించిందనే వార్తల మధ్య విలక్షణ నటుడు కమల్ హాసన్ హాస్పిటల్‌కు వచ్చారు. వైద్యులు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. హాస్పిటల్ తిరిగి వెళ్తూ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆరోగ్యం బాగుందని చెప్పను. కాకపోతే ఆయన కోలుకోవాలని ప్రార్థిద్దాం అంటూ విషాద వదనంతో వెళ్లిపోయారు.

10 మెరుగైన వైద్యుల పర్యవేక్షణలో

10 మెరుగైన వైద్యుల పర్యవేక్షణలో

ఎస్పీ బాలు ఆరోగ్యాన్ని కుదటపరిచేందుకు 10 మంది వైద్యులతో కూడిన బృందం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. తమిళనాడు ప్రభుత్వం బాలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్దపెట్టి సహకారం అందిస్తున్నది. ఎప్పటికప్పుడు బాలు ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ వైద్యులతో తమిళనాడు ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నది.

Recommended Video

Telugu Cinema Paataku Praanam Nuvvu | Ravi Varma Potedar's Song On SPB
భారీగా హాస్పిటల్‌కు చేరుకొన్న కుటుంబ సభ్యుల, అభిమానులు

భారీగా హాస్పిటల్‌కు చేరుకొన్న కుటుంబ సభ్యుల, అభిమానులు

ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి విషమించిందనే వార్తలతో కుటుంబ సభ్యులందరూ ఎంజీఎం హాస్పిటల్‌కు చేరుకొన్నారు. అంతేకాకుండా అభిమానులు కూడా భారీగా తరలిరావడంతో హాస్పిటల్ పరిసరాల్లో స్వల్ప ఆంక్షలు విధించారు. కరోనా పరిస్థితుల కారణంగా అభిమానులు, శ్రేయోభిలాషులు హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో ఉండకూడదు అని హెచ్చరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X