ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
గాన గంధర్వుడు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహణ్యంకు దేశంలోనే రెండో అత్యున్నత పురస్కరమైన పద్మ విభూషణ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతీ ఏటా దేశంలో పద్మ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుందన్న సంగతి తెలిసిందే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతీ ఏడా పద్మ అవార్డులను ప్రకటిస్తుంటారు. సామాజిక, సాంస్కృతిక, కళా రంగాలు వివిధ రకాలు సేవలు అందింంచిన, అందిస్తోన్న వారికి పద్మ అవార్డులను ప్రకటిస్తుంటారు. ఇందులో కొందరికీ మరణానంతరం కూడా పద్మ అవార్డులు వరిస్తుంటాయి.
Recommended Video

పద్మ అవార్డుల ప్రకటన..
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించి ఈ ఏడాదికి గానూ తాజాగా పద్మ అవార్డులను ప్రకటించారు. అలా ఈ ఏడాదిగానూ దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్‌ను ఏడుగురికి, మూడో అత్యున్నత పురస్కారమైన పద్మ భూషన్‌ను పది మందికి, పద్మ శ్రీని 102 మందికి ప్రకటించింది.

ఎస్పీబీకి నివాళిగా..
ఎస్పీబీ బాలసుబ్రహ్మణ్యంకు గతంలో 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్‌లు వచ్చాయి. తాజాగా కేంద్రం ప్రకటించిన వాటిలో ఎస్పీబీకి పద్మ విభూషణ్ అవార్డు ఉంది. మరణానంతరం ఎస్పీబీకి దేశ రెండో అత్యున్నత పురస్కారం లభించింది. అయితే ఎస్పీబీది భారత రత్న స్థాయి అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

కరోనాతో అనారోగ్యం..
ఎస్పీబీ కరోనాతో పోరాడుతూ చివరకు కోట్లాది మంది అభిమానులను అనాథలను చేసి వెళ్లిపోయారు. గతేడాది సెప్టెంబర్ 25న ఎస్పీబీ కన్నుమూశారు. అయితే ప్రస్తుతం ఎస్పీబీ భారత ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని కల్పించింది.

సింగర్ చిత్రకు..
సింగర్ చిత్రకు సైతం పద్మ అవార్డు లభించింది. దేశంలో మూడో అత్యున్నత పౌరపుస్కారమైన పద్మ భూషణ్ చిత్రను వరించింది. మొత్తానికి సింగర్స్ ఫ్యామిలీలోనే దేశంలోని అత్యున్నత పురస్కారాలు లభించడంతో అందరూ ఆనంద వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











