SP Balasubrahmanyam.. యాభై యేళ్ల బంధానికి తెర.. ఎస్పీబీ మృతిపై భారతీ రాజా ఎమోషనల్
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోట్ల మంది సంగీత ప్రేమికులను అనాథలను చేసి వెళ్లిపోయారు. దాదాపు యాభై రోజులకు పైగా పోరాడి నేడు కన్నుమూశారు. ఆగస్ట్ 5న కరోనా సోకడంతో చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ ఉన్న ఎస్పీబీ నిన్నటి సాయంత్రం వరకు బాగానే ఉన్నారు. అకస్మాత్తుగా పరిస్థితి విషమించడంతో నిన్న సాయంత్రం సినీ ప్రపంచం మొత్తం ఆందోళనకు గురైంది. కాసేపటి క్రితమే ఎస్పీబీ కన్నుమూశారని ఎస్పీ చరణ్ ప్రకటిచారు.

చివరి ప్రకటన చేసిన చరణ్..
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించారన్న వార్తను చెప్పేందుకు ఎస్పీ చరణ్ మీడియా ముందుకు వచ్చారు. 01: 04 నిమిషాలకు మరణించారని చెబుతూ చరణ్ ఎమోషణల్ అయ్యారు. ఇక లేరు అనే వార్త చెబుతూ.. కంటతడి పెట్టుకున్నాడు. ఇక ఈ వార్త తెలియడంతో సంగీత ప్రేమికులందరూ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

నిన్ననే ఆందోళన కరంగా..
ఎస్పీబీ ఆరోగ్యంపై వార్తలు వచ్చిన వెంటనే లోకనాయకుడు కమల్ హాసన్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నాడు. కమల్ హాసన్, ఎస్పీబీది దశాబ్దాలా అనుబంధం. అప్పట్లో కమల్ హాసన్ సినిమాలన్నింటికి దాదాపు ఎస్పీబీ గాత్రమందించారు. ఎస్పీబీ లేరన్న వార్తతో కమల్ కుంగిపోయాడు.

భారతీ రాజా ఎమోషనల్..
ఎస్పీబీతో యాభై యేళ్ల అనుబంధం ఉన్న భారతీ రాజా కన్నీరు మున్నీరు అయ్యారు. తాను బాధలో ఉన్నప్పుడు ఎలాంటి మాటలు రావడంటూ ఎస్పీబీ మరణంతో భారతీ రాజా కుంగిపోయాడు. ఈ ఇద్దరు ఇండస్ట్రీకి రాకముందు నుంచీ ప్రాణ స్నేహితులు.
Recommended Video

పైన ఓ శక్తి..
కొన్ని కొన్ని సందర్భాల్లో మాటలు రావు.. మనం ఎన్నో అనుకుంటాం కానీ అన్నీ జరగవు.. పైన ఓ శక్తి అనేది ఉంటుంది. దాని ముందు మనమంత తలొంచాల్సిందే అంటూ ఎస్పీబీపై ఎమోషనల్ అయ్యారు. ఇక భారతదేశం మొత్తం బాలు మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతోంది. సెలెబ్రిటీలందరూ సంతాపాన్ని తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications