అలాంటి హీరోయిన్లకే నిర్మాతల ఆఫర్లు.. బాత్రూంలో చేసేటివి చూపిస్తారా?.. బాలు

Recommended Video

SP Balasubrahmanyam Made Sensational Comments on Tollywood | Filmibeat Telugu

ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు సంప్రదాయలు, సంస్కృతి, ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పాల్గొనే కార్యక్రమాల్లో పలు అంశాలపై ఆవేదన వ్యక్తం చేసే ఎస్పీ బాలు మరో ముందడుగు వేసి రాజకీయాలను తూర్పార పట్టారు. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సినీ నిర్మాతలు, హీరోయిన్లు, రాజకీయ నాయకుల తీరుపై ఫైర్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే..

భాష మీద తెలుగు వాళ్లకి

భాష మీద తెలుగు వాళ్లకి

భాష మీద అభిమానం, పిపాస లేనిది తెలుగు వాళ్లకే. మిగితా రాష్ట్రాల్లో ఇది కనిపించదు. వారు భాషను అమితంగా ప్రేమిస్తారు. పదాలు పలకడం కూడా రాదు. ఇక భాష గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. టెలివిజన్, ఇతర కార్యక్రమాల్లో మాట్లాడే భాష వింటే మా ప్రాణాలు పోతుంటాయి అని బాలూ పేర్కొన్నారు.

బాత్రూంలో చేసే పనులను

బాత్రూంలో చేసే పనులను

ఎవరైనా ఏమైనా అంటే ఇంగ్లీష్ సినిమాల్లో చూపిస్తున్నారు కదా అంటారు. వాళ్లు బాత్రూంలో చేసే పనులు చూపిస్తే మనం కూడా అవి చూపించగలమా? మన సంప్రదాయాలు వేరు.. వారి సంప్రదాయాలు వేరు. కాబట్టి మన సంప్రదాయాలను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది అని బాలు ఆవేదన వ్యక్తం చేశారు.

హీరోయిన్లను చూస్తే మండిపోతుంది

హీరోయిన్లను చూస్తే మండిపోతుంది

ఏదైనా కార్యక్రమం జరిగితే వేదిక మీదకు వచ్చే హీరోయిన్లను చూస్తే ఒళ్లు మండిపోతుంటుంది. పొట్టి దుస్తులు వేసుకుంటే తప్ప నిర్మాతలు, దర్శకులు ఛాన్స్‌లిస్తారనుకొంటారేమో నాకు అర్థం కాదు. సినీ పరిశ్రమలో ఇలాంటి పరిస్థితి దారుణంగా తయారైంది అంటూ బాలసుబ్రహ్మణం అన్నారు.

వాళ్లకే నిర్మాత ఆఫర్లు

వాళ్లకే నిర్మాత ఆఫర్లు

సినిమా ఇండస్ట్రీలో ఇతర భాషల హీరోయిన్లకే అవకాశాలు ఎక్కువగా ఇస్తున్నారు. వారి అంగాంగ ప్రదర్శన చూసి హీరోలు, నిర్మాతలు వారికి ఛాన్సులిస్తారు. ఇలాంటి విషయాలపై మాట్లాడటానికి నేను భయపడను. ఏ హీరోయిన్‌కైనా కోపం వచ్చిన పర్లేదు అని అన్నారు.

మర్డర్లు చేసేవారే పాలిటిక్స్‌లో

మర్డర్లు చేసేవారే పాలిటిక్స్‌లో

రాజకీయాల్లో పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. 10, 20 మర్డర్లు చేసి జైలుకుపోయి వచ్చిన వాళ్లే రాజకీయాల్లో కనిపిస్తారు. జైల్లో నుంచే గెలిచి సభల్లోకి వెళుతారు. వారి చేసిన దుర్మార్గాలకు శిక్ష పడితే ఐదారు ఏళ్లలో బయటకు వచ్చేస్తారు. ఎవరైతే బేడీలు వేస్తారో వారితోనే సలాంలు కొట్టించుకొంటారు అని బాలు తీవ్రంగా స్పందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X