భారతీయులందరికీ అభిమాని.. ఎస్పీ బాలు మృతిపై కేసీఆర్ సంతాపం
దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణవార్త ప్రపంచ సంగీతాభిమానులను విషాదంలో ముంచెత్తింది. ఎస్పీ బాలు ఇక లేరనే వార్తతో సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఎస్పీ బాలుతో ఉన్న అనుబంధాన్ని, స్నేహ బంధాన్ని గుర్తు చేసుకొంటున్నారు. ఈ క్రమంలో ఎస్పీ బాలు మరణంపై సీఎం తీవ్ర దిగ్రాంతిని వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ తన సంతాప ప్రకటనతో ఎమోషనల్ అయ్యారు. ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన బాలు భారతీయ ప్రజలందరికీ అభిమాని అయ్యారు. అలాంటి మహోన్నత వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం దురదృష్టకరం. ఆయన లేని లోటు ఎన్నటికీ పుడ్చలేనిది. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయన సినీ లోకానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి . కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని సీఎం కేసీఆర్ తన సంతాప ప్రకటనలో తెలిపారు.

కరోనావైరస్ వ్యాధిని ఎస్పీ బాలు జయించారు. కానీ కరోనా వల్ల కలిగిన ఇన్‌ఫెక్షన్ రావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. గత 50 రోజులుగా మృత్యువుతో పోరాడుతూ ఎస్పీ బాలసుబ్రమణ్యం శుక్రవారం (సెప్టెంబర్ 25న) 1.04 గంటలకు కన్నుమూశారు.


Click it and Unblock the Notifications











