twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భార్య చెప్పిన మాట విని ఉంటే.. ఎస్పీ బాలు పరిస్థితి ఇలా ఉండేది కాదేమో.. వారి కోసం ప్రేమగా

    |

    ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇకలేరన్న వార్తను సంగీత ప్రియులను, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నో దశాబ్దాలుగా తన గాన మాధుర్యంతో సినీ, సంగీత ప్రేక్షకులను అలరిస్తున్న బాలు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణం కుటుంబ సభ్యులకే కాకుండా మ్యూజిక్ ఫ్యామిలీకి తీరని విషాదం మిగిల్చింది. కుటుంబ సభ్యులు వారిస్తున్న సంగీత కళాకారులు సహయం కోసం నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడమే ఆయన మరణానికి దారి తీసిందనే వార్త కలిచి వేస్తున్నది. సావిత్రి చెప్పిన విషయాలు ఏమిటంటే..

    మే చివరి వారంలో హైదరాబాద్‌కు

    మే చివరి వారంలో హైదరాబాద్‌కు

    కరోనా సమయంలో సంగీత కళాకారులు సహాయార్థం ప్రముఖ టెలివిజన్ ఛానెల్ మే నెలాఖరున సంగీత దర్శకులు, గాయకులతో హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు. ఆ కార్యక్రమం కోసం చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి మూడు రోజులపాటు ఆ కార్యక్రమంలో పాలు పంచుకొన్నారు.

    కరోనావైరస్ విలయతాండవం అంటూ భార్య హెచ్చరించినా

    కరోనావైరస్ విలయతాండవం అంటూ భార్య హెచ్చరించినా

    బాలు కార్యక్రమంలో పాలుపంచుకొన్న సమయంలో చెన్నై, హైదరాబాద్‌లో కరోనావైరస్ విలయతాండవం చేస్తున్నది. ఆ పరిస్థితుల్లో బయటకు వెళ్లవద్దని భార్య సావిత్రి వేడుకొన్నారనేది సన్నిహితులు వెల్లడించారు. అయితే పేద కళాకారులు కరోనా సమయంలో కష్టాలకు గురి అవుతున్నారు. వారికి మేలు చేసే కార్యక్రమంలో పాల్గొనకపోతే అర్ధం ఉండదు అంటూ బాలు ఇంటి సభ్యుల మాటలు పట్టించుకోకుండా హైదరాబాద్‌కు వచ్చారు.

    ఆగస్టు 5వ తేదీన హాస్పిటల్‌కు

    ఆగస్టు 5వ తేదీన హాస్పిటల్‌కు

    హైదరాబాద్‌లో జరిగిన సంగీత కచేరి సమయంలోనే బాలసుబ్రమణ్యం కరోనావ్యాధికి గురయ్యారనేది తెలిసిందే. ఆగస్టు 5వ తేదీన స్వయంగా తాను కరోనావైరస్ బారిన పడినట్టు ఓ వీడియోను రిలీజ్ చేసి చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరారు. ఆగస్టు రెండోవారంలో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. అప్పటి నుంచి ఆయన మృత్యువుతో పోరాటం చేస్తూ వచ్చారు.

    Recommended Video

    Rajinikanth,Pawan Kalyan,K viswanath Expresses Their Condolences For SPB
     కరోనా సమయంలో సంగీత కళాకారులకు అండగా

    కరోనా సమయంలో సంగీత కళాకారులకు అండగా

    కరోనా సమయంలో ఆర్థికంగా సమస్యల్లో ఉన్న పలువురు సంగీత కళాకారులకు ఎస్పీ బాలు సహాయం అందించారు. సోషల్ మీడియా ద్వారా స్వచ్ఛంద సేవలను వేడుకొంటూ కళాకారులును ఆదుకొనే ప్రయత్నం చేశారు. సంగీత వారసత్వ సంపదగా మారిన ఎస్పీ బాలు ఇక లేరనే వార్తతో సంగీత ప్రియులు, కళాకారులు విషాదంలో మునిగిపోయారు.

    English summary
    SP balasubrahmanyam no more: Wife Savitri about legendary singer SB Balu last days journey. Savithri said that, She was stopped him not to attende music concert in Hyderabad. Balu was infected with Coronavirus after this concert.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X