Don't Miss!
- News మూడు శుభయోగాలతో ఉగాది ప్రారంభం; మూడు రాశులవారికి అదృష్టం!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్‌పై వేటు!
- Lifestyle మీ బాయ్‌ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్‌లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Finance IPO News: మార్కెట్లోకి రాకేష్ జున్‌జున్‌వాలా ఐపీవో.. డబ్బు రెడీ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
చరణ్ బట్టలేసుకొనేవాడు.. అజిత్‌కు అప్పట్లో చాలా కష్టాలు.. మృత్యువు చేరువకు: ఎస్పీ బాలు
తమిళ సూపర్‌స్టార్ అజిత్ కెరీర్ తొలినాళ్లలో తెలుగు సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం అందరికి తెలిసిందే. ఆరంభంలో హీరోగా నిలదొక్కుకోవడానికి చాలానే కష్టాలనే ఎదుర్కొన్నాడు. అలా తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ అంచెలంచెలుగా అగ్రహీరోగా మారి దక్షిణాది చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్ ట్యాగ్‌ను సొంతం చేసుకొన్నారు. అయితే తల అజిత్ గురించి ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. సూపర్ సింగర్ అనే కార్యక్రమంలో ఎస్పీబీ చెప్పిన విషయాలు ఏమిటంటే..
మా ఎన్నికలు: మెగా ఫ్యామిలిలో శ్రీరెడ్డి చిచ్చు.. చిరంజీవి, నాగబాబు తలోదారి.. మెగా హీరోలు ఎటువైపు
అజిత్ ఫ్లాష్ బ్యాక్ గురించి
అజిత్ కెరీర్ తొలి రోజులను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గుర్తు చేసుకొంటూ.. నా కుమారుడు చరణ్, అజిత్ క్లాస్మేట్స్. ఆంధ్రలోనే మెట్రిక్యులేషన్ వరకు చదువుకొన్నారు. అజిత్‌కు కొన్ని సెంటిమెంట్లు ఎక్కువ. యాడ్ షూటింగ్ కోసం వెళ్లేటప్పుడు నా కుమారుడి బట్టలు, షూస్ వేసుకొని వెళ్లేవాడు. అలా వేసుకోవడం అజిత్‌కు ఓ సెంటిమెంట్ అని తెలిపారు.
కెరీర్ ఆరంభంలో అజిత్
కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు, గుర్తింపు పాత్రల్లో నటించేవాడు. ఓ సారి జరిగిన ప్రమాదంతో ఆయన ప్రాణాలకే ముప్పు కలిగింది. దాదాపు మరణం నుంచి తృటిలో తప్పించుకొన్నారు. తమిళంలో అడుగుపెట్టి వరుస విజయాలు సొంతం చేసుకోవడంతో అగ్రహీరోగా మారిపోయాడు అని బాలు చెప్పారు.
నా సినిమాలో హీరోగా
నేను నిర్మించిన సినిమాలోనే అజిత్ హీరోగా నటించడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అజిత్‌లో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఆయన ఎన్నడూ మ్యాగజైన్లకు గానీ, టీవీలకు గానీ ఇంటర్వ్యూలు ఇవ్వడు. సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్లు చేయడు. అనవసరపు వివాదాల జోలికి వెళ్లడు అని ఎస్పీబీ వెల్లడించారు.
సినిమాలు, ఫ్యామిలీ తప్ప మరో..
గతంలో మోటార్ రేసింగ్ అంటే అజిత్‌కు చాలా ఇష్టం. అయితే ఇప్పుడు వాటిపై ఆసక్తిని తగ్గించుకొన్నాడు. షాలిని పెళ్లి చేసుకొన్న తర్వాత సినిమాలు, ఫ్యామిలీ తప్ప మరో లోకం అజిత్‌కు తెలియదు. పరిశ్రమలోని రాజకీయాలను పట్టించుకోడు. ఇతర జీవితాల్లోకి తొంగిచూడడు అని బాలు అన్నారు.
పింక్ రీమేక్‌లో అజిత్ కుమార్
ఇక అజిత్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల ఆయన నటించిన విశ్వాసం చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. సుమారు రూ.250 కోట్లను బాక్సాఫీస్ వద్ద వసూలు చేసింది. ప్రస్తుతం హిందీ చిత్రం పింక్ రీమేక్‌లో నటిస్తున్నారు. నేరు కొండ పార్వయి అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి బోనికపూర్ నిర్మాత. విద్యాబాలన్ అతిథి పాత్రను పోషిస్తున్నారు.