»   » అకౌంట్ హ్యాక్: డబ్బు కావాలంటూ ఎస్పీ బాలు!

అకౌంట్ హ్యాక్: డబ్బు కావాలంటూ ఎస్పీ బాలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: ఈ మధ్య సినిమా సెలబ్రిటీల ఈమెయిల్ అకౌంట్స్, సోషల్ నెట్వర్కింగ్ అకౌంట్ హ్యాక్ చేస్తున్నసైబర్ నేరగాళ్లు వారిని సమస్యల్లో నెట్టి వేస్తుండటం...ఇబ్బంది పెడుతుండటం లాంటివి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నారు ప్రముఖ తెలుగు గాయకుడు ఎస్పీబాలసుబ్రహ్మణ్యం.

  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈమెయిల్ అకౌంటును సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసారు. ఆయన ఉపయోగిస్తున్న యాహూ మెయిల్ హ్యాక్ చేసి డబ్బు కావాలంటూ మెయిల్స్ పంపుతున్నారు. వెస్టర్న్ యూనియన్ ద్వారా ద్వారా ఉక్రెయిన్‌కు డబ్బు పంపాలంటూ సదరు మెయిల్స్ ఉంటున్నాయట.

  SP Balasubrahmanyam's E-Mail Account Hacked

  ఈ విషయం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దృష్టికి రాగానే ఆయన వెంటనే తన ఫేస్ బుక్ ద్వారా అందరినీ అప్రమత్తం చేసారు. తన ఈమెయిల్ అకౌంట్ హ్యాక్ అయిందని, తన spbindia@outlook.com ద్వారా డబ్బు పంపాలనే సందేశాలు వస్తున్నాయని, వాటిని నమ్మొద్దని, అవి స్పామ్ మెయిల్స్ అని తెలిపారు.

  తన యాహూ ఈ మెయిల్ అకౌంటును డిలీట్ చేసినట్లు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. తాను ఆరోగ్యంగా, క్షేమంగా యూఎస్‌లో ఉన్నట్లు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పాడుతా తీయగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 9 నుండి 12 సంవత్సరాల పిల్లలు ఈ రియాల్టీ షోలో పాల్గొంటున్నారు.

  English summary
  Impostors and cyber hackers are making celebrities' lives difficult on internet. While the formers deceive people and cause immense trauma, the latter have become the most worrying part for public figures as they use their accounts for wrong reasons. In both the cases, celebrity is the biggest loser. The latest victim of hacking is none other than singer SP Balasubrahmanyam.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more