twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అకౌంట్ హ్యాక్: డబ్బు కావాలంటూ ఎస్పీ బాలు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఈ మధ్య సినిమా సెలబ్రిటీల ఈమెయిల్ అకౌంట్స్, సోషల్ నెట్వర్కింగ్ అకౌంట్ హ్యాక్ చేస్తున్నసైబర్ నేరగాళ్లు వారిని సమస్యల్లో నెట్టి వేస్తుండటం...ఇబ్బంది పెడుతుండటం లాంటివి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నారు ప్రముఖ తెలుగు గాయకుడు ఎస్పీబాలసుబ్రహ్మణ్యం.

    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈమెయిల్ అకౌంటును సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసారు. ఆయన ఉపయోగిస్తున్న యాహూ మెయిల్ హ్యాక్ చేసి డబ్బు కావాలంటూ మెయిల్స్ పంపుతున్నారు. వెస్టర్న్ యూనియన్ ద్వారా ద్వారా ఉక్రెయిన్‌కు డబ్బు పంపాలంటూ సదరు మెయిల్స్ ఉంటున్నాయట.

    SP Balasubrahmanyam's E-Mail Account Hacked

    ఈ విషయం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దృష్టికి రాగానే ఆయన వెంటనే తన ఫేస్ బుక్ ద్వారా అందరినీ అప్రమత్తం చేసారు. తన ఈమెయిల్ అకౌంట్ హ్యాక్ అయిందని, తన [email protected] ద్వారా డబ్బు పంపాలనే సందేశాలు వస్తున్నాయని, వాటిని నమ్మొద్దని, అవి స్పామ్ మెయిల్స్ అని తెలిపారు.

    తన యాహూ ఈ మెయిల్ అకౌంటును డిలీట్ చేసినట్లు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. తాను ఆరోగ్యంగా, క్షేమంగా యూఎస్‌లో ఉన్నట్లు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పాడుతా తీయగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 9 నుండి 12 సంవత్సరాల పిల్లలు ఈ రియాల్టీ షోలో పాల్గొంటున్నారు.

    English summary
    Impostors and cyber hackers are making celebrities' lives difficult on internet. While the formers deceive people and cause immense trauma, the latter have become the most worrying part for public figures as they use their accounts for wrong reasons. In both the cases, celebrity is the biggest loser. The latest victim of hacking is none other than singer SP Balasubrahmanyam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X