ఏక ఛత్రాధిపత్యంగా పాలించారు.. మరో వందేళ్లు సజీవంగా ఉంటారు.. ఎస్పీబీపై రజినీ, శంకర్, రాజమౌళి ఎమోషనల్
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) మృతితో సంగీత ప్రపంచం మూగబోయింది. కోట్ల మంది అభిమానుల్ని ఒంటరి చేసి స్వర్గానికి పయనమయ్యారు. ఆగస్ట్ 5న కరోనా పాజిటివ్ రావడంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్నా కూడా ఆరోగ్యం మాత్రం కుదుటపడేలేదు. నిన్న సాయంత్రం పరిస్థితి విషమించడంతో నేడు (సెప్టెంబర్ 25) ఒంటి గంట నాలుగు నిమిషాలకు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. ఎస్పీబీ మరణం వార్తపై రాజమౌళి, శంకర్, రజినీకాంత్ ఎమోషనల్ అయ్యారు.

ఏక ఛత్రాధిపత్యంగా పాలించారు
‘బాలు గారు తెలుగు, తమిళం, కన్నడ భాషల సంగీత ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏక ఛత్రాధిపత్యంగా పాలించారు. ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి అద్భుతం జరగలేదు. ఆ ఏలిక మరి రాదు. చాలామంది తమిళ కన్నడ సోదరులు ఆయన తెలుగు వాడంటే ఒప్ప్పుకునేవారు కాదు. బాలు మావాడు అని గొడవ చేసేవారు అని రాజమౌళి తెలిపాడు.

ఒక్క బాలు గారికే సాధ్యం..
అన్ని భాషలలోను పాడారు. అందరిచేత మావాడు అనిపించుకున్నారు. ఈ ఘనత ఒక్క బాలు గారికే సాధ్యం. ఆయన పాడిన పాటలు మిగిల్చిన అనుభూతులు తరతరాలకీ కొనసాగుతాయి. మహోన్నతమైన ఆయన గాత్రానికి భక్తి ప్రపత్తులతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.' అంటూ దర్శక ధీరుడు రాజమౌళి ఎమోషనల్ అయ్యాడు.

వందేళ్ల పాటు..
ఇది ఎంతో బాధాకరమైన రోజు. ఎన్నో రోజులు పోరాడి మనల్ని వదలి వెళ్లారు. ఆయన మరణ వార్త విని ఎంతో వేదన చెందాను. ఆయన పాటకు, గాత్రానికి అభిమాని కాని భారతీయులెవ్వరూ ఉండరు. ఆయన వ్యక్తిగతంగా తెలిసిన వారికి మరింత ఇష్టం పెరుగుతుంది. రానున్న వందేళ్లు ఆయన తన పాటలు, గాత్రంతో సజీవంగానే ఉంటారు. భారతదేశంలో మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్ వంటి వారెందరో ఉన్నారు.. గానీ వారందరిలో ఎస్పీబీ ప్రత్యేకం.. ఆయన అన్ని భాషల్లో తన గాత్రాన్ని వినిపించారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ రజినీ కాంత్ ఎమోషనల్ అయ్యాడు.
Recommended Video

అందులో టాప్..
పాట రిలీజ్ కాకముందే, ఆడియన్స్‌ను రీచ్ కాకముందే అది హిట్ అని చెప్పగలిగే పాటలు, అలా పాడే క్వాలిటీ కలిగిన సింగర్స్ అతి కొద్ది మందే ఉంటారు. అందులో టాప్ ప్లేస్‌లో ఉంటారు బాలు గారు. మిమ్మల్ని మిస్ అవుతున్నాం.. మీ వాయిస్‌ను కాదు.. అదెప్పుడూ గాల్లోనే ఉంటుంది అంటూ దర్శకుడు శంకర్ ఎమోషనల్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











