twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎస్పీ బాలుకు లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు

    By Srikanya
    |

    హైదరాబాద్ :ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను చైతన్య భారతి సంగీత, నృత్య, నాటక పరిషత్‌ సంస్థ జీవితకాల సాఫల్య పురస్కారంతో సత్కరించనుంది. ఈ నెల 30న భీమవరంలో జరిగే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా బాలసుబ్రహ్మణ్యంకు పురస్కారం అందజేస్తారు.

    బాలసుబ్రహ్మణ్యంను స్వర్ణ కంకణంతో గౌరవించనున్నట్లు సంస్థ గౌరవాధ్యక్షులు గజల్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలోనే గాయని సునీతకు హార్థిక చైతన్య పురస్కారం అందజేస్తారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    SP.Balasubrahmanyam to get life time award

    క్రిందటి నెలలోనూ ...

    ప్రముఖ గాయకుడు,నటుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. గాయకుడిగా వివిధ భాషల్లో అనేక భక్తి పాటలు ఆలపించినందుకుగాను కేరళ ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక హరివరాసనం అవార్డుకు ఎంపిక చేసింది.

    శబరిమల అయ్యప్ప స్వామి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేలా భక్తి పాటలను ఆలపించడంతోపాటు వివిధ భాషల్లో అనేక భక్తి గీతాలు ఆలపించి ఆధ్యాత్మిక చింతనను, దేశ సంస్కృతిని, దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పి కళారంగంలో చేసిన సేవలకు గాను కే జయశంకర్ నేతృత్వంలోని కేరళ అత్యున్నత స్థాయి కమిటీ ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది.

    హరివరాసనం అవార్డు కింద రూ.లక్ష నగదుతోపాటు జ్ఞాపికను అందజేయనున్నారు. గతంలో ఈ నగదు బహుమతి రూ.50,000 ఉండగా దీనిని రూ.లక్షకు పెంచారు.

    English summary
    Popular singer SP.Balasubrahmanyam will be honoured with lifetime achievement award on 30th May in Bhemavaram by Chaitanya Bharati Sangeeta, Nrutya Nataka Parishat. AP Deputy CM KE.Krishnamurthy will be presenting the award to SP.Balasubramanyam. Organisation's honorary president Ghazal Srinivas said SPB will be honoured with Swarna Kankanam. Singer Suneetha will also be honoured with Harthika Chaitanya award.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X