twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఊహించని అవమానం.. ఆవేదన చెందుతూ పోస్ట్

    |

    ఇటీవల జరిగిన మహాత్మ గాంధీ 150 జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ సినీ ప్రముఖులతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ మీట్‌లో పలువురు ఉత్తరాది తారలతో పాటు దక్షిణాది తారలు కూడా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో అక్కడి సిబ్బంది వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. వివరాల్లోకి పోతే..

    నరేంద్రమోదీ మీట్.. దక్షిణాది సినీ ప్రముఖుల అసంతృప్తి

    నరేంద్రమోదీ మీట్.. దక్షిణాది సినీ ప్రముఖుల అసంతృప్తి

    మహాత్మ గాంధీ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 29వ తేదీన హిందీ ఫిల్మ్ స్టార్స్‌తో పాటు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని కొంతమంది సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. అప్పటి నుంచే ఈ మీట్‌పై దక్షిణాది సినిమా ఇండస్ట్రీ నుంచి అసహనాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.

    మోదీ తీరుపై ఉపాసన ట్వీట్.. దిల్ రాజు, బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళే..

    సౌత్‌లోని అగ్రతారలకు ఆహ్వానాలు అందకపోవటంతో, కార్యక్రమంలో పాల్గొన్న కొద్ది మంది దక్షిణాది సినీ ప్రముఖుల ఫోటోలు కూడా బయటకు రాకపోవటంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా అసంతృత్తి వ్యక్తం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి దిల్ రాజు, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి కొంతమందికి మాత్రమే ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. అదేవిదంగా రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన ట్విటర్‌ వేదికగానే మోదీ తీరుపై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే.

    రామోజీరావుగారి కారణంగా అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

    రామోజీరావుగారి కారణంగా అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

    ఇదిలా ఉండగానే తాజాగా ఈ సమావేశానికి హాజరైన సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా తన స్పందన తెలపడం చర్చనీయాంశంగా మారింది. రామోజీరావుగారి కారణంగా మోదీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు దక్కింది. అందుకు ఆయనకు కృతజ్ఞతలు. కార్యక్రమానికి హాజరైన మమ్మల్ని ఎంట్రన్స్‌ దగ్గర మా ఫోన్లు సెక్యూరిటీ వారికి అప్పగించి వెళ్ళమని అన్నారని బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

    తీరా లోపలి వెళ్ళాక చూస్తే..

    తీరా లోపలి వెళ్ళాక చూస్తే..

    కానీ తామంతా లోపలికి వెళ్ళాక కొంతమంది స్టార్లు మాత్రం ప్రత్యేకంగా ప్రధానితో సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ సంఘటన చాలా అసంతృప్తిని కలిగించిందని a ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన పోస్ట్‌లో పేర్కొన్నారు. వారిదగ్గర సెల్ ఫోన్స్ ఎలా వచ్చాయి అని అడిగితే వారంతా జాతీయ స్థాయి కావడంతో వారిదగ్గర నుండి సెల్ ఫోన్స్ తీసుకోలేదు అన్న సమాధానం వచ్చిందట. దీంతో ఈ విషయాన్ని అందరి ముందు ఉంచుతూ ఇలా తన అసంతృత్తిని వెళ్లగక్కారు బాలసుబ్రమణ్యం.

    English summary
    SP Balasubrahmanyam upset with PM Modi. On this issue he posted a social media message.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X