twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సింగర్ కావాలని కలలో కూడా అనుకోలేదు.. SPB మొదటి డ్రీమ్, 200రూ. సంపాదించాలని..

    |

    1946 జూన్ 4న జన్మించిన SPB పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. నేపథ్య గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా నటుడిగా ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న ఎస్పీబీ ఈ 75ఏళ్ళ వయసులో తుది శ్వాస విడువడం సంగీత లోకానికి ఒక తీరని లోటు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇలా భారతదేశంలోని దాదాపు అన్ని భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడారు.

    Recommended Video

    #SPBalasubramaniam : SP Balasubramaniam About His First Dream Job And Salary || Oneindia Telugu
    సాధించని విజయాలు లేవు

    సాధించని విజయాలు లేవు

    బాలసుబ్రహ్మణ్యం సాధించని విజయాలు లేవు గెలుపొందని శిఖరాలు లేవు. పరిపూర్ణమైన జీవితం. సాఫల్యమైన పుట్టుక అని ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ఎంతో గొప్పగా చెప్పారు. అయితే నిజానికి బాలసుబ్రహ్మణ్యం సినిమాకు సంబంధించిన గాయకుడు అవ్వాలని కలలో కూడా అనుకోలేదు.

    బాలసుబ్రహ్మణ్యం మొదటి డ్రీమ్ అదే

    బాలసుబ్రహ్మణ్యం మొదటి డ్రీమ్ అదే

    నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించిన బాలు తండ్రి ఒక హరికథా కళాకారుడు. అందువల్లే అక్కడి నుంచి సంగీతం మీద ఆసక్తి పెరిగింది. సంగీతం అంతవరకే అనుకున్నారు. కానీ ఆయన మనసులో ఒక బలమైన డ్రీమ్ ఉండేదట. ఎప్పటికైనా ఇంజినీర్ అవ్వాలని అనుకున్నాను. ఒక టోపీ పెట్టుకొని జీపులో వెళ్లాలని అనుకునే వాన్ని అని జయప్రదం ఇంటర్వ్యూలో చెప్పేవారు.

    200రూపాయలు వస్తే..

    200రూపాయలు వస్తే..

    దాని గురించి మాట్లాడుతూ.. ఆ రోజుల్లో 200రూపాయల జీతం వస్తే గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్. ఆ విధంగా సంపాధించాలని చాలా పెద్ద డ్రీమ్ ఉండేది. కానీ సింగర్ గా మారడం అనేది చాలా యాదృచ్చికంగా అనుకోకుండా జరిగింది. ఇంజినీరింగ్ చదువుతన్న సమయంలోనే సినిమాల్లో పాడటం స్టార్ట్ చేశాను.

    రెండు గుర్రాల మీద స్వారీ కుదరడం లేదని

    రెండు గుర్రాల మీద స్వారీ కుదరడం లేదని

    కానీ నాలుగవ సంవత్సరంలో బిజీగా ఉండడం రెండు గుర్రాల మీద స్వారీ కుదరడం లేదని చదువుకోవడానికి మళ్ళీ వయసు ఉందని సినిమా దారిని ఎంచుకున్నాను. కానీ సినిమా ఇండస్ట్రీలోని సంగీతం ప్రపంచంలో నేను ఈ స్థాయిని అందుకుంటానని కూడా ఉహీంచలేదు. పైగా అప్పట్లో నా కంటే సీనియర్లు చాలా మంది ఉన్నారు. నిలదొక్కుకుంటానని కూడా అనుకోలేదు..అని SPB వివరణ ఇచ్చారు.

    తోలి పాట ఆ సినిమాలోనే

    తోలి పాట ఆ సినిమాలోనే

    ఇక బాలసుబ్రహ్మణ్యం 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో తోలి సినీ గాయకుడిగా అవకాశం దక్కింది. ఎస్పీబీ భార్య సావిత్రి. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పల్లవి, ఎస్. పి. చరణ్. ఇక బాలు సోదరి ఎస్. పి. శైలజ కూడా సినీ నేపథ్య గాయని. నటుడు శుభలేఖ సుధాకర్ ను శైలజా వివాహం చేసుకుంది.

    English summary
    After ghantasala in Indian music history, the singer SPB impressed music lovers at that level. Balasubramanian. No matter what song he sings, it has a lot of significance. The number of interviews given to SPB media is very low. He can say very strongly what he has in mind. In an interview with a YouTube channel in 2017, SPB said something important.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X