ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకు భారీ ఎత్తున సన్మానం..డిటేల్స్
గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా సిడ్నీలో స్థిరపడిన ప్రవాసాంధ్రుడు సన్మానం జరపనున్నారు. సిడ్నీలో ప్రవాసాంధ్రుడు కోడూరి రామమూర్తి నెలకొల్పిన ఫైన్‌ఆర్ట్స్ అండ్ కల్చర్స్ థీమ్స్ సంస్థ తరఫున జూన్ 5న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో బాలును ఘనంగా సన్మానించనున్నారు. ఈ సందర్భంగా హైదరా బాద్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తణికెళ్ళ భరిమి మాట్లాడుతూ...ఏ రంగంలోనివారైనా అభిమానించే వ్యక్తి...ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆయన గాత్ర మాధుర్యంతో ఎందరినో అలరించారు. ఆయన్ని 'బాల గాంధర్వమ్' పేరుతో సత్కరించుకోవడం సంతోషం అన్నారు. సాయికుమార్ మాట్లాడుతూ...'బాలుగారితో చిన్నతనం నుంచీ పరిచయముంది. ఆయన నా సినిమాలకు పాడారు. ఈ కార్యక్రమంలో భరణిగారు రచించి, స్వరపరిచి, గానం చేసిన 'శభాష్ రా శంకర్' అనే సీడీని ఆవిష్కరించి దాన్ని బాలుగారికి అంకితం ఇవ్వనున్నా'మన్నారు. ఈ కార్యక్రమానికి దక్షిణ భారతదేశంలో ఉన్న సినీ రంగ ప్రముఖులు రానున్నారు. కమల్ హాసన్, ఇళయరాజా తదితరులు హాజరవుతారు.


Click it and Unblock the Notifications











