త్వరలోనే దర్శకత్వం : ఎస్పీ బాలసుబ్రమణ్యం
నేపథ్య గాయకుడిగా భారతీయ సినీ సంగీత చరిత్రలో శిఖరాగ్ర స్థానాన్ని అందుకున్న ఎస్.పి. బాల సుబ్రమణ్యం త్వరలో ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా మీడియాకు వెల్లడించారు. కాకినాడలో ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన మాట్లాడుతూ....'పాడుతా తీయగా' నా సంగీత కళాశాల అని పేర్కొన్నారు.
ప్రస్తుతం తాను 'గోపురం' అనే చిత్రంలో నటిస్తున్నానని, ఇందులో తాను పోషిస్తున్న పాత్ర తెలుగువారంతా గర్వపడేలా ఉంటుందిని బాలు చెప్పకొచ్చారు. బాలు రాక సందర్భంగా నిర్వాహకులు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. ఆయన్ను చూసేందుకు పలువురు సంగీత అభిమానులు తరలి వచ్చారు.
గోపురం సినిమాతో పాటు జనార్ధన మహర్షి 'దేవస్థానం' చిత్రంలోనూ బాల సుబ్బహ్మణ్యం నటిస్తున్నారు. ఇందులో కళా తపస్వి కె. విశ్వనాథ్ తో పాటు, ఆమని నటిస్తున్నారు. ఓ వైవిధ్యభరితమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు కెమెరా: సురేష్ కుమార్, సంగీతం: స్వరవాణి.


Click it and Unblock the Notifications











