twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎస్పీబీ పరిస్థితి విషమం.. ఆందోళనతో తమన్ ట్వీట్

    |

    గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమించిందని తెలుస్తోంది. కరోనా బారిన పడటం, చికిత్స అనంతరం నెగెటివ్ రావడం, ఆరోగ్యంగానే ఉన్నారంటూ తనయుడు ఎస్పీ చరణ్ నిత్యం అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. కానీ సడెన్‌గా బాలు ఆరోగ్యం మళ్లీ క్షిణించిందని తెలుస్తోంది ఈ మేరకు తమన్ చేసిన ట్వీట్ ఆందోళన కలిగిస్తోంది. బాలు పరిస్థితి విషమంగా ఉందనే వార్తలు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తోంది.

    కరోనా బారిన..

    కరోనా బారిన..

    ఎస్సీబీ ఆగస్టు 5న కరోనా వైరస్ బారిన పడిన సంగతిత తెలిసిందే. చెన్నై లోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకోవడం, ప్రతీ రోజూ ఆరోగ్యంపై అప్డేట్ ఇవ్వడం, చరణ్ దగ్గరుండి మరీ చూసుకున్న సంగతి తెలిసిందే. ఎస్సీబీ కరోనా నుంచి కోలుకున్నారన్న సంగతి తెలియడంతో అందరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

    ఎప్పుడెప్పుడు రావాలా అని..

    ఎప్పుడెప్పుడు రావాలా అని..

    ఎస్పీబీ సంగీతానికి రియాక్ట్ అవుతున్నారని, పాటలు పాడాలని ప్రయత్నిస్తున్నారని ఎస్పీ చరణ్ తెలిపిన సంగతి తెలిసిందే. ఇక ఎప్పుడెప్పుడు ఆస్పత్రి నుంచి బయటకు రావాలా? అని ఎదురుచూస్తున్నాడని నిన్నటి హెల్త్ బుల్లిటెన్‌లో చరణ్ పేర్కొన్నాడు.

    పరిస్థితి విషమం..

    పరిస్థితి విషమం..

    ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ పెరగటంతో అప్పట్లో ఆయన ఆరోగ్యం క్షీణించింది. దాంతో అప్పటి నుంచి ఆయన ఎక్మో సపోర్టుతో చికిత్స తీసుకుంటున్నారు. గత 40 రోజులుగా ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా ఆయన ఆరోగ్యం క్షిణించినట్టు తెలుస్తోంది. పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

    అందరూ ప్రార్థించండి..

    అందరూ ప్రార్థించండి..

    ఎస్పీబీ ఆరోగ్యంపై వార్తలు వస్తుండటంతో వాటిపై ఎవ్వరికీ క్లారిటీ రాలేదు. కానీ తమన్ వేసిన ట్వీట్‌తో అందరూ ఆందోళనలో పడ్డారు. ఎస్పీబీ గారి ఆరోగ్యం క్షీణించింది.. ఆయన కోలుకోవాలని అందరూ ప్రార్థించండని వేడుకున్నాడు. త్వరగా రండి సర్ అంటూ ఎమోషనల్ అయ్యాడు.

    English summary
    Sp BalaSubramanyam Health Condition Is Become Serious, Thaman Become Eotional On SPB Health. Let’s pray for #SPB gaaru Clapping hands sign Need all ur prayers at this hour Clapping hands signFolded hands #getwellsoonspbsir
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X