twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎస్పీ బాలుకు కేరళలలో అవార్డు

    By Srikanya
    |

    తిరువనంతపురం: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కేరళ ప్రభుత్వం అందించే హరివరాసనమ్‌ పురస్కారాన్ని స్వీకరించారు. శనివారం శబరిమలలో పురస్కార ప్రదానోత్సవం జరిగింది. కేరళ మంత్రి వీఎస్‌ శివకుమార్‌ చేతుల మీదుగా బాలసుబ్రహ్మణ్యంకు పురస్కారంతో పాటు రూ.లక్ష నగదు బహుమతి అందజేశారు.

    ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ''నా జీవితంలో ఎన్నో పురస్కారాలు అందుకున్నాను. కానీ హరివరాసనమ్‌ పురస్కారం ప్రత్యేకమైంది. ఈ పురస్కారం అందుకోవడం చాలా ఆనందంగా ఉంద''ని తెలిపారు.

    SP.Balasubramanyam honoured in Kerala

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    హరివరాసనం అవార్డు కింద రూ.లక్ష నగదుతోపాటు జ్ఞాపికను అందజేయనున్నారు. గతంలో ఈ నగదు బహుమతి రూ.50,000 ఉండగా దీనిని రూ.లక్షకు పెంచారు. గాయకుడిగా వివిధ భాషల్లో అనేక భక్తి పాటలు ఆలపించినందుకుగాను కేరళ ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక హరివరాసనం అవార్డుకు ఎంపిక చేసింది.

    శబరిమల అయ్యప్ప స్వామి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేలా భక్తి పాటలను ఆలపించడంతోపాటు వివిధ భాషల్లో అనేక భక్తి గీతాలు ఆలపించి ఆధ్యాత్మిక చింతనను, దేశ సంస్కృతిని, దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పి కళారంగంలో చేసిన సేవలకు గాను కే జయశంకర్ నేతృత్వంలోని కేరళ అత్యున్నత స్థాయి కమిటీ ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసింది.

    English summary
    Travancore Devosam presented the prestigious Harivasarasanam award for this year to SP.Balasubramanyam.Kerala Endowments Minister VN.Shiva Kumaron presented the award to SPB along with a cash prize of Rs 1 lakh on saturday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X