ఎస్పీ బాలు హాస్పిటల్ బిల్లుల వివాదంపై ఎస్పీ చరణ్ ఆగ్రహం.. మాకు మరింత క్షోభకు అంటూ వివరణ

ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణ విషాదం నుంచి కోలుకోక ముందే ఆయన హస్పిటల్ ఖర్చుల అంశం సోషల్ మీడియాలో వైరల్ కావడం వివాదంగా మారింది. గత రెండు రోజులుగా ఎస్పీ బాలు చెల్లించిన బిల్లు ఇదే అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నది. ఈ వివాదంలోకి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబాన్ని కూడా లాగడం మరింత చర్చనీయాంశమైంది. ఈ వివాదంపై ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్ స్పందిస్తూ...

Recommended Video

SP Charan Clarity On SP Balasubrahmanyam Hospital Bill | Oneindia Telugu
రూమర్లను ఖండించిన ఎస్పీ చరణ్

రూమర్లను ఖండించిన ఎస్పీ చరణ్

తన తండ్రి ఎస్పీ బాలు వైద్య పరీక్షల ఖర్చులను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుటుంబం చెల్లించారనే విషయంపై ఎస్పీ చరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వైద్యం బిల్లుల విషయంలో తమిళనాడు ప్రభుత్వాన్ని, ఉప రాష్ట్రపతిని సంప్రదించారనే వార్తలను ఆయన ఖండించారు. ఇలాంటి వార్తలను నమ్మకండి. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయకండి అని వేడుకొన్నారు.

 ఆ వార్తలు తీవ్రంగా బాధించాయని ఎస్పీ చరణ్

ఆ వార్తలు తీవ్రంగా బాధించాయని ఎస్పీ చరణ్

ఎస్పీ బాలసుబ్రమణ్యం బిల్లుల విషయాన్ని సోషల్ మీడియాలో చర్చ జరగడం, విస్తృతంగా ప్రచారం జరగడంపై స్పందిస్తూ.. బిల్లులను పూర్తిగా చెల్లించకపోవడం వల్లే హాస్పిటల్ యాజమాన్యం నా తండ్రి భౌతికకాయాన్ని అప్పగించలేదనే రూమర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుల విషయంలో తమిళనాడు ప్రభుత్వాన్ని, ఉప రాష్ట్రపతి కుటుంబాన్ని సంప్రదించారనే వార్తల్లో వాస్తవం లేదు. ఇలాంటి వార్తలు తీవ్రంగా బాధించాయి అని ఎస్పీ చరణ్ పేర్కొన్నారు.

త్వరలోనే సంయుక్త ప్రకటన చేస్తాం

త్వరలోనే సంయుక్త ప్రకటన చేస్తాం

నా తండ్రి మరణంతో పుట్టెడు విషాదంలో ఉన్న మా కుటుంబాన్ని ఇలాంటి రూమర్లు మరింత క్షోభకు గురిచేశాయి. ఈ వ్యవహారంపై స్పందించాలని హాస్పిటల్ యాజమాన్యాన్ని ఇప్పటికే కోరాం. త్వరలోనే సంయుక్తంగా ప్రకటన చేస్తాం. నా తండ్రికి అందించిన అద్భుతమైన వైద్యసేవలకు హాస్పిటల్ యాజమాన్యానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను అని ఎస్పీ చరణ్ అన్నారు.

బిల్లుల వివాదంపై ఉప రాష్ట్రపతి కుమార్తె దీపా వెంకట్ స్పందన

బిల్లుల వివాదంపై ఉప రాష్ట్రపతి కుమార్తె దీపా వెంకట్ స్పందన

ఎస్పీ బాలసుబ్రమణ్యం హాస్పిటల్ బిల్లుల వివాద అంశంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూతురు దీపా వెంకట్ ఇప్పటికే స్పందించారు. తాము బిల్లులను చెల్లించినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. ఎస్పీ బాలు కుటుంబం మాకు అత్యంత సన్నిహితంగా ఉంటారు కాబట్టే హాస్పిటల్ యాజమాన్యం ఆయనకు అందించిన వైద్యం వివరాలు మాకు వెల్లడించారనే విషయాన్ని దీపా వెంకట్ ఓ ప్రకటనలో తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X