ఎస్పీ బాలు అంత్యక్రియలకు అజిత్ రాకపోతే ఏంటి?.. ఘాటుగా స్పందించిన చరణ్
ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణాంతరం అనేక వివాదాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఒక్క హాస్పిటల్ బిల్లులపై రాద్దాంతం జరుగుతుండగా, మరో పక్క సెలబ్రిటీలు ముఖం చాటేయడంపై నిరసన వ్యక్తమవుతున్నది. అయితే ఎస్పీ బాలు అంత్యక్రియలకు తమిళ సూపర్‌స్టార్ అజిత్ హాజరుకాకపోవడంపై మీడియాలో, సోషల్ మీడియాలో వివాదంగా మారింది. ఈ వివాదంపై ఎస్పీ చరణ్ స్పందిస్తూ..

బాలు అంత్యక్రియలకు సూపర్ స్టార్ విజయ్
ఎస్పీ బాలు అంత్యక్రియలకు టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమకు చెందిన ఏ ఒక్కరు హాజరుకాకపోవడంతో నిరసనలు, ఒకింత అసహనం వ్యక్తమవుతున్నది. అయితే ఎవరూ ఊహించని రీతిలో సూపర్‌స్టార్ విజయ్ అంత్యక్రియలకు హాజరవ్వడం, పుట్టెడు బాధలో ఉన్న ఎస్పీ చరణ్‌ను పరామర్శించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అజిత్ ఎందుకు హాజరుకాలేదంటూ..
ఎస్పీ చరణ్‌కు హీరో అజిత్ మంచి స్నేహబంధం ఉంది. వారిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. అయితే తన స్నేహితుడు తండ్రి మరణిస్తే అజిత్ పరామర్శించరా? అంత్యక్రియలకు హాజరుకారా అనే విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. విజయ్ ఫ్యాన్స్, అజిత్ ఫ్యాన్స్ మధ్య ఎప్పటిలానే సోషల్ మీడియాలో వార్ జరిగింది. ఈ నేపథ్యం వివాదం మరింత ముదరక ముందే ఎస్పీ బాలు స్పందించి వివరణ ఇచ్చారు.

నాకే కాదు.. నాన్నకు కూడా అజిత్ మంచి స్నేహితుడు
తమిళ స్టార్ అజిత్ నాకు స్నేహితుడు. అంతేకాకుండా నా తండ్రికి కూడా మంచి ఫ్రెండ్. ఆయన నా తండ్రి అంత్యక్రియలకు వచ్చారా? లేదా అనే విషయాన్ని పట్టించుకోవద్దు. నా తండ్రికి ఎలా శ్రద్దాంజలి ఘటించారనేది ముఖ్యం. ఇలాంటి విషయాన్ని కూడా సమస్యగా మార్చడం చాలా బాధకరం అని ఎస్పీ చరణ్ అన్నారు.
Recommended Video

అజిత్ రాకపోవడంపై వివాదం వద్దు
ఎస్పీ బాలు అంత్యక్రియలకు అజిత్ హాజరుకాలేదనే విషయంపై వివాదం చేయొద్దు. ప్రస్తుత పరిస్తితుల్లో వీలు కాకపోవచ్చు. ఒకవేళ నా తండ్రికి ఇంట్లోనే అజిత్ తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రద్దాంజలి ఘటిస్తే అందులో తప్పేముంది. అతడికి వీలైన విధంగా ఎస్పీ బాలుకు నివాళి అర్పించి ఉండొచ్చు. ఇప్పుడు పరిస్థితుల్లో వ్యక్తిగతంగా వచ్చి శ్రద్దాంజలి ఘటించే అవసరం లేదనే నేను భావిస్తున్నా అని ఎస్పీ చరణ్ మీడియాకు తన అభిప్రాయాలను వెల్లడించారు.


Click it and Unblock the Notifications