సడెన్‌గా OTTలోకి వచ్చేసిన రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

ఈ మధ్య కాలంలో అనేక అద్భుతమైన సినిమాలు అతి త్వరగా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. బాక్సాఫీసును షేక్ చేసిన సూపర్ డూపర్ హిట్టు చిత్రాలతో పాటు ఓ మాదిరిగా ఆడిన సినిమాలు కూడా వెంటనే ఓటీటీల్లోకి వచ్చి సందడి చేస్తున్నారు. ఓటీటీ ప్రియులను తెగ అలరించడానికి ప్రతీ వారం అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల అవుతున్నాయి. అయితే తాజాగా ఓ రీసెంట్ ఇంటెరాగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందా.

రామ్ గన్ని దర్శకత్వంలో రీసెంట్ గా వచ్చిన ఇంటెరాగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమానే ది ట్రయల్. ఈ సినిమాలో స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటులు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. అలాగే ఉదయ్ పులిమే, సఖి ఉత్తడ, జశ్వంత్ పెరుమాళ్ల, వజీర్ ఇషాన్ లు కూడా కీలక పాత్రల్లో కనిపించారు. గతేడాగి నంవబర్ 24వ తేదీన థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేకపోయింది. పెద్ద సినిమాలు ఉండడం, ఈ సినిమా చిన్నది కావడంతో ఎవరూ ఈ చిత్రాన్ని చూసేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు.

Spandana Palli Yug Ram Recent Crime Thriller The Trial Movie OTT Streaming Details

అద్భుతమైన కథతో వచ్చిన ఈ చిత్రాన్ని ఎస్ఎస్ ఫిల్మ్స్, కామన్ మేన్ ప్రొడక్షన్ బ్యానర్ పై స్మృతి సాగి, శ్రీనివాస్ కె నాయుడులు కలిసి నిర్మించారు. అలాగే ఈ చిత్రానికి సాయి కుమార్ దారా సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా.. శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించారు. శరవణ వాసుదేవన్ సంగీతం అందించారు. లేడీ ఓరియంటెడ్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా థియేటర్ల వద్ద పెద్దగా ఆడకపోయినప్పటికీ సినీ ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుంది. సినిమా విడుదల అయి రెండు నెలలు కూడా గడవకముందే ఓటీటీలో వచ్చేసింది.

Spandana Palli Yug Ram Recent Crime Thriller The Trial Movie OTT Streaming Details

ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అయిపోతుందీ చిత్రం. ఇప్పటి వరకు ఈ సినిమాను థియేటర్లలో చూడని వారు, క్రైమ్ థ్రిల్లర్ స్టోరీస్ అంటే ఇష్ట పడే వాళ్లు ఎంచక్కా ఈ సినిమాను ఓటీటీలో చూసేయచ్చు. ఫ్యామిలీతో కలిసి కూర్చుని మరీ ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఎందుకు ఆలస్యం అదిరిపోయే కథతో వచ్చిన ఈ చిత్రాన్ని వెంటనే చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X