సెక్స్ వేధింపుల కేసు: చరణ్‌కు బెయిల్

By Bojja Kumar

సెక్సువల్ వేధింపుల కేసులో ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్.పి బాల చరణ్ కు మద్రాసు హైకోర్టు యాంటిసిపెటరీ బెయిల్‌ను గురువారం మంజూరు చేసింది. తమిళ నటి, ఐటం గర్ల్ సోనా పై అత్యాచార యత్నానికి పాల్పడ్డట్లు చరణ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సోనా ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్టు చేసి అతనిపై మహిళలపై వేధింపుల చట్టం కింద ఐపిసి సెక్షన్ 354 కింద కేసులు పెట్టారు. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న చరణ్‌కు...ఈ మేరకు రూ. 10వేల పూచికత్తు, ఇద్దరు వ్యక్తుల షూరిటీ మీద రెండు వారాల బెయిల్ మంజూరైంది.

విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం కొడుకు కోసం బాలసుబ్రహ్మణ్యం సోనాతో రాజీ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చరణ్ తనకు వ్రాతపూర్వకమైన క్షమాపణలు చెబితే తప్ప కేసు వెనక్కు తీసుకోనని సోనా తేల్చి చెప్పినట్లు సమాచారం. గత వారం చెన్నయ్ లో జరిగిన ఓ ప్రైవేటు పార్టీ సందర్భంలో చరణ్... సోనాపై రేప్ అటెమ్ట్ చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. యాక్టర్ వైభవ్ రెడ్డి నివాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X