తెలుగు, తమిళ్ వాళ్లు నన్ను తిట్టొచ్చు.. ఎంత ఏడిస్తే అంటూ.. ఎస్పీ బాలు సంతాప సభలో చరణ్ కంటతడి
ప్రఖ్యాత గాయకుడు ఎస్సీ బాలసుబ్రమణ్యం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారనే విషయాన్ని ఇంకా అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు, కళాకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో ఉన్న అనుభూతులను పలు మాధ్యమాల ద్వారా పంచుకొంటున్నారు. ఎస్పీ బాలుకు ఘనంగా శ్రద్దాంజలి ఘటించడానికి చెన్నైలో సంతాప సభను బుధవారం నిర్వహించారు. భావోద్వేగంతో కూడిన కార్యక్రమంలో ప్రఖ్యాత గాయకులు, కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ చరణ్ ఎమోషనల్‌గా మాట్లాడుతూ..

నాన్నను అభిమానించే వాళ్లు అనేక భాషల్లో
తమిళులు గానీ, తెలుగు వారు గానీ, ఇతర భాషల వారు గానీ నన్ను తిట్టుకోవచ్చు. కానీ నాన్న ఎస్పీ బాలు సంతాప సభలో నేను ఇంగ్లీష్‌లో మాట్లాడాలనుకొంటున్నాను. ఎందుకంటే నాన్నను అభిమానించే వాళ్లు పలు భాషల్లో ఉన్నారు. వారికి అర్ధమయ్యే కామన్ భాష ఇంగ్లీష్‌లో మాట్లాడాలనుకొంటున్నాను. నాన్న హాస్పిటల్‌లో ఉన్న సమయంలో నాకు సహకారం అందించాలనుకొంటున్నాను అని ఎస్పీ చరణ్ పలువురికి థ్యాంక్స్ చెప్పారు.

నాన్నతో ఎన్నో జ్ఞాపకాలు, అనుభవాలు
మా నాన్నతో చాలా అనుభూతులు, అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని చెప్పడం వల్ల ఉపయోగం ఏమిలేదు. కానీ వాటిని నేను హృదయంలోనే శాశ్వతంగా పదిల పరచుకోవాలనుకొంటున్నాను. మా నాన్నకు ఎంతో గొప్ప స్నేహితులు ఉన్నారు. వారే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకొచ్చారు. నా కోసం, నా కుటుంబానికి ఎంతో సహాయం చేసిన వారికి నేను రుణపడి ఉంటాను. వారికి ఓ థ్యాంక్స్‌తో రుణం తీర్చుకోలేను అని ఎస్పీ చరణ్ అన్నారు.

నా జీవితంలో ఇలా జరుగుతుందని
మా నాన్నకు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తానని గానీ, ఇలాంటి సభలో ఇలా మాట్లాడుతానని అనుకోలేదు. చాలా దురదృష్టకరం. కానీ నా జీవితంలో జరుగాల్సింది జరిగిపోయింది. ఏ మనిషి అయితే మన మధ్య నుంచి వెళ్లిపోయారో అతడిని తలచుకొంటూ ముందుకు సాగిపోవాలని అనుకొన్నాను. అందుకోసమే నేను ఈ సభలో మాట్లాడేందుకు వచ్చాను అని ఎస్పీ చరణ్ పొంగుకొస్తున్న దు:ఖాన్ని ఆపుకొంటూ మాట్లాడారు.
Recommended Video

నాపై ఇలా బాధ్యతలు పెడుతారని
మా నాన్న గారు నాపై ఇలా బాధ్యతలు పెడుతారని ఊహించలేదు. ఏదో సందర్భంలో అరెయ్.. ఇక నేను రిటైర్ అవుతున్నాను. ఇక అన్ని చూసుకో అంటారేమో అనుకొన్నాను. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఈ బాధను అనుభవించడానికి సమయం కూడా ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంత ఏడ్చితే మనసు బలంగా మారుతుందనుకొంటున్నాను. ఈ బాధ నుంచి త్వరగా బయటపడి నాన్న నాపై పెట్టిన బాధ్యతలను నెరవేర్చాలనుకొంటున్నాను అని ఎస్పీ చరణ్ భావోద్వేగానికి గురయ్యారు.


Click it and Unblock the Notifications











