IPL మ్యాచ్‌లు జరిగేటప్పుడు..మాతో అలా ఎంజాయ్.. ఎస్పీబాలును తలుచుకొని చరణ్ ఎమోషనల్

దివంగత ఎస్సీ బాలసుబ్రమణ్యం సంతాప సభను చెన్నైలో ఇటీవల ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు, సాంకేతిక నిపుణులు, సినీ తారలు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ చరణ్ మాట్లాడుతూ.. తన తండ్రి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకొన్నారు. ప్రతీ ఒక్కరు మా కుటుంబానికి అండగా నిలిచారు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని ఎస్పీ చరణ్ వెల్లడిస్తూ..

స్నేహితుడి కంటే ఎక్కువగా

స్నేహితుడి కంటే ఎక్కువగా

ఎస్పీ బాలు నాకు నాన్ననే కాదు. ఓ స్నేహితుడి కంటే ఎక్కువ. ఆయనను మరిచిపోవడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. ఆయన నాకే కాదు.. నా కుటుంబానికి, ఆయన మనవళ్లకు, మనవరాండ్లకు ఎంతో నేర్పించారు. ఇంక ముందు కూడా నేర్పిస్తూనే ఉంటారు. నాన్న మరణం తర్వాత అందరి దృష్టి నాపై ఉంది. నాపై నాన్న ఎంతో బాధ్యతను పెట్టారు. ఆ బాధ్యతను ఎలా నెరవేరుస్తారనే విషయాన్ని అందరూ గమనిస్తున్నారు అని ఎస్పీ చరణ్ ఉద్వేగానికి లోనయ్యారు.

ఎంతో మంది ప్రార్థనలు చేశారు

ఎంతో మంది ప్రార్థనలు చేశారు

నాన్న 50 రోజులపాటు మృత్యువుతో పోరాటం చేస్తున్న సమయంలో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఎంతో మంది ప్రార్థనలు చేశారు. అందుకు మా కుటుంబం తరఫున ప్రతీ ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాన్నగారి సంతాప సభ పెట్టాలని నన్ను అడిగినప్పుడు నేను కాదనలేకపోయాను. వారంతా ఆయనపై ఉన్న ప్రేమభిమానాలు చాటుకోవడానికి ముందుకు వచ్చారు అని ఎస్పీ చరణ్ ఎమోషనల్ అయ్యారు.

క్రికెట్, ఐపీఎల్ మ్యాచులు జరిగేటప్పుడు

క్రికెట్, ఐపీఎల్ మ్యాచులు జరిగేటప్పుడు

నాన్న సంతాప సభను నా స్నేహితులు నిర్వహిస్తామని చెబితే కాదనలేకపోయాను. ఎందుకంటే నాకంటే ఎక్కువగా వాళ్లు నాన్నతో అనుబంధాన్ని పెంచుకొన్నారు. నాన్నకు క్రికెట్ అంటే ఇష్టం. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచులు జరిగేటప్పుడు, ఫైనల్స్ జరిగిటప్పుడూ మా ఇంటిలోని బార్‌లో నా స్నేహితులతో డ్రింక్ చేస్తూంటే నాన్న జాయిన్ అయ్యేవారు. వారితో సరదగా మ్యాచ్ చూస్తూ హ్యాపీగా ఫీలయ్యేవారు అని ఎస్పీ చరణ్ తెలిపారు.

నా స్నేహితులతో కలిసి

నా స్నేహితులతో కలిసి

నా స్నేహితులకు నాన్నతో చాలా చనువు ఉంది. ఆయనకు కూడా నా స్నేహితులంటే అంతే ఇష్టం. వయసుతో తేడా లేకుండా కలిసిపోయేవాడు. నాన్న జీవితాన్ని ఎంతగానో ఆస్వాదించారు. ప్రతీ ఒక్కరితో జీవితాన్ని సెలబ్రేట్ చేసుకొన్నారు. ఆయనతో ఇక్కడ ఉన్న ప్రతీ ఒక్కరికి జీవితాంతం మిగిలిపోయే అనుభూతులు ఉన్నాయి అని ఎస్పీ చరణ్ తెలిపారు.

Recommended Video

#SPBalasubramaniam : Sekhar Kammmula,Boyapati Srinu,Raghu Kunche Expresses Their Condolences For SPB
నా బాల్యంలో ఎక్కువ సమయాన్ని గడపలేకపోయా

నా బాల్యంలో ఎక్కువ సమయాన్ని గడపలేకపోయా

నాన్న ఎప్పుడూ బిజీగా ఉండటం కారణంగా మా బాల్యంలో ఆయనతో ఎక్కువ సమయం గడపలేకపోయాను. కానీ ఆయనతో ఎక్కువగా స్టేజీలపైనో, స్టూడియోలో వద్ద ఎక్కువ సమయాన్ని గడిపాం. మా నాన్న ఏంటో అప్పుడే తెలుసుకొన్నాం. నా జీవితంలో అదే గొప్ప సమయం. ఇంటిలో కంటే స్టూడియోలలో, స్టేజ్‌లపైనే ఉండటానికి ఆయన ఇష్టపడేవారు. ఆ సమయంలో ఆయనను హ్యాపీగా ఉండేలా నేను, నాతల్లి చూసుకొనే వాళ్లం అని ఎస్పీ చరణ్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X