బాలయ్యకు బాలు డబ్బింగ్
ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రమణ్యం హీరో బాలకృష్ణకు డబ్బింగ్ చెప్పబోతున్నారు. బాలయ్య నటించిన శ్రీరామరాజ్యం త్వరలో తమిళ వెర్షన్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీరామరాజ్యం 50 రోజుల ఫంక్షన్ లో బాల సుబ్రమణ్యం స్వయంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తనకు ఈ అవకాశం దక్కడంపై ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. బాలయ్యకు తమిళం అంతబాగా మాట్లాడటం రానందున బాలుతో డబ్బింగ్ చెప్పించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా సీత పాత్ర పోషించిన నయనతారకు డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి వాయిస్ అందించబోతున్నారు.
బాపు దర్శకత్వంలో బాలకృష్ణ, నయనతార సీతారాముల పాత్ర ధారులుగా శ్రీరామరాజ్యం సినిమా రూపొందిన విషయం తెలిసిందే. యలమంచిలి సాయిబాబు నిర్మించిన ఈ చిత్రం నిన్న విజయవంతంగా 49 సెంటర్లలో 50 రోజుల పూర్తి చేసుకుంది. ఈ సినిమా బాలయ్య, నయనతార కెరీర్లో మంచి గుర్తింపు తెచ్చిన సినిమా నిలిచింది.


Click it and Unblock the Notifications











