twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'స్పెషల్‌ ఛబ్బీస్‌' తెలుగు రీమేక్ దర్శకుడు ఖరారు

    By Srikanya
    |

    హైదరాబాద్: మొత్తానికి హిందీలో మంచి విజయం సాధించిన 'స్పెషల్‌ ఛబ్బీస్‌' చిత్రం తెలుగు రీమేక్ కు రంగం సిద్దమైంది. తెలుగు,తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించటానికి ప్రముఖ తమిళ దర్సకుడు లింగు స్వామి రైట్స్ తీసుకున్నారు. తమ బ్యానర్ తిరపతి బ్రదర్శ్ పై ఈ చిత్రం రైట్స్ తీసుకున్న లింగు స్వామి,తానే డైరక్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ మేరకు ప్రకటన వచ్చే అవకాసం ఉంది. హీరో,హీరోయిన్స్ ఎవరనేది ఇంకా తెలియరాలేదు.

    అక్షయ్‌ కుమార్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా రూపొందిన హిందీ చిత్రం 'స్పెషల్ చబ్బీస్'. 'స్పెషల్ చబ్బీస్' చిత్రం యదార్థ సంఘటలన ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. ఈ చిత్రంలో అక్షయ్ నకిలీ పోలీసాఫీసర్‌గా చేశారు. నీరజ్‌పాండే తనదైన శైలిలో చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఎమ్‌.ఎమ్‌.కీరవాణి స్వరాలు సమకూర్చారు. '1980వ దశకంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. సీబీఐ నుంచి వచ్చాం అంటూ నగల దుకాణాల్నీ, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తల్నీ ఓ బృందం ఎలా దోచుకొందో తెరపైనే చూడాలి. ప్రతి సన్నివేశం వినోదాత్మకంగా సాగుతుంది.

    మార్చి 19, 1987లో ఒక అజ్ఞాత వ్యక్తి తాను సీబీఐ అధికారినని నమ్మబలికి 26 మంది ఆదాయపు పన్నుశాఖ అధికారుల బృందంతో ఒపెరా హౌజ్‌లోని త్రిభువన్‌దాస్‌ జవేరీ నగల దుకాణంలో లక్షలాది విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన సంఘటనను తెరకెక్కించారు. నకిలీ ఐటీ అధికారుల పేరుతో ఇటీవలి సంఘటనల ఆధారంగా దర్శకుడు నీరజ్‌ పాండే ఈ సినిమాను తీసారు. రియా చౌహాన్‌ అనే ఒక ఉపాధ్యాయిని పాత్రలో కాజల్ కనిపించింది.

    మరో ప్రక్క ఈ చిత్రం తెలుగులో నాగార్జున చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై నాగార్జునని..గ్రీకు వీరుడు ట్రైలర్ లాంచ్ లో మీడియా వారు 'స్పెషల్‌ ఛబ్బీస్‌' సినిమా రీమేక్‌ చేస్తున్నారట కదా? అని ప్రశ్నించారు. దానికి నాగార్జున సమాధానమిస్తూ... ''ఈ వార్త ఎలా పుట్టిందో తెలీదు. నేనసలు ఆ సినిమా చూళ్లేదు. కానీ 'మీరు చేస్తే బాగుంటుంది' అని అందరూ చెబుతున్నారు. చూద్దాం.. నాకూ అలాగే అనిపిస్తే తప్పకుండా చేస్తా'' అన్నారు. ఈ చిత్రం నాగార్జునకి సూట్ అవుతుందని,డిగ్నిఫైడ్ గా ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. మరి లింగు స్వామి ..నాగార్జునని ఎంపిక చేస్తారో లేదో చూడాలి.

    English summary
    Impressed with the storyline of the film, Lingusamy, who has directed films like Vettai, Paiyaa in Tamil, has bought the remake rights of Special 26 on behalf of his production house Thirupathy Brothers. The film will be remade in both Telugu and Tamil. It still remains to be seen who’s going to direct the remake and the casting process will begin shortly. More details about the film will be announced soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X