ఇదీ రాజమౌళి ‘బాహుబలి’ ప్రపంచం (స్పెషల్ వీడియో )
హైదరాబాద్: రాజమౌళి రూపొందిస్తున్న పీరియడ్ చిత్రం బాహుబలి'. నిన్న ముంబైలో జరిగిన కామిక్ కాన్ ఫెస్టివల్ లో పెద్ద హిట్ గా నిలిచింది. ఈ కార్యక్రమానికి రానా దగ్గుబాటి మరియు ఇతర టీం సభ్యులు హాజరయ్యారు. వారందరూ ‘బాహుబలి' సినిమా గురించి మాట్లాడిన సమయంలో ప్రేక్షకుల నుండి అద్బుత స్పందన లభించింది.
https://www.facebook.com/TeluguFilmibeat
అంతేకాకుండా ఈ ఫెస్టివల్ లో ‘బాహుబలి' స్పెషల్ వీడియో ప్రదర్శించారు. వీడియో చూసిన తర్వాత అందరూ నిలబడి తమ గౌరవాన్ని తెలిపారు. ఇదే వీడియోను నేడు 10 గంటలకు విడుదల చేసారు. మూవీ మేకింగ్, భారి సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఈ వీడియోలో చూపించారు. ఆ వీడియోను మీరు కూడా చూడండి.
రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'బాహుబలి'. ప్రభాస్ హీరో. అనుష్క, తమన్నా, రానా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. బల్గేరియాలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ ప్రభాస్, తమన్నాపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఆ షెడ్యూల్ పూర్తయిన వెంటనే నిర్మాణానంతర కార్యక్రమాలపై దృష్టిపెడతారు.

మనిషి తలచుకుంటే సాధించలేనిది లేదు. అయితే ఆ తలపు అత్యాశతో కూడినదైతే ఆ మనిషికి రేపు అనేది ఉండదు. ఈ అంశంతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. గతంలో రాజుల నేపథ్యంలోనూ ఇలాంటి కథలు తీశారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇలాంటి అంశంతోనే 'బాహుబలి'ని రూపొందిస్తున్నారు.
ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రధారులు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. ఈ చిత్రానికి కథ: కె.వి.విజయేంద్రప్రసాద్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: సెంథిల్ కుమార్.


Click it and Unblock the Notifications











