twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దూకుడు' స్పెషల్ ట్రైన్స్ టు విజయవాడ!?

    By Srikanya
    |

    దూకుడు యాభై రోజుల పంక్షన్ ని గ్రాండ్ గా విజయవాడలో జరుపటానికి ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందునిమిత్తం నిర్మాత అనీల్ సుంకర స్పెషల్ ట్రైన్స్ ని ప్లాన్ చేస్తునట్లు మహేష్ ప్యాన్స్ చెప్తున్నారు. ఇక అనీల్ సుంకర అయితే ఈ విషయమై చెప్తూ.. యాభై రోజుల పంక్షన్ ని ది బెస్ట్ అనేలా చేస్తాం అన్నారు. ఇక మహేష్ ప్యాన్స్ రిక్వెస్ట్ మేరకు స్పెషల్ దూకుడు ఎక్సప్రెస్ ట్రైన్స్ ని ఏర్పాటు చేస్తున్నారని, విశాఖపట్టణం నుంచి విజయవాడ వరకూ, తిరుపతి నుంచి విజయవాడకు, సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వేస్తున్నారని అంటున్నారు. అయితే దీనిపై అనీల్ సుంకర అఫీషియల్ గా ఏ ప్రకటనా చెయ్యలేదు.

    ఈ నెల 12న వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ కార్యక్రమం జరుగుతోంది. దూకుడు నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపిచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వారు ఆ వివరాల్ని వెల్లడిస్తూ ''చిత్ర పరిశ్రమలో భారీ విజయంగా మా చిత్రం నిలిచింది. 350 కేంద్రాల్లో యాభై రోజులు పూర్తి చేసుకొంటుంది. వేడుకనీ ఆ స్థాయిలోనే చేస్తాం. ఈ కార్యక్రమానికి కృష్ణ, కె.రాఘవేంద్రరావు, పూరి జగన్నాథ్‌ ప్రత్యేక ఆహ్వానితులు గా వస్తారు. సినీ నటులు పలువురు హాజరవుతారు అన్నారు.

    అలాగే ఈ చిత్రానికి ప్రజలు అఖండ విజయం అందించడం పట్ల ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసారు. ఇక ఒక్కడు తర్వాత మహేష్‌ బాబు పబ్లిక్ ఫంక్షన్‌లో పాల్గొనడం ఇదే అని చెప్పుకోవచ్చు. కృష్ణ, మహేష్‌ బాబు అభిమానులు ఈ ఉత్సవంలో భారీ ఎత్తున పాల్గొంటున్నట్లు తెలిసింది. అలాగే 60 కోట్ల నుంచి 80 కోట్ల రూపాయల వరకూ ఈ చిత్రం వసూలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకూ 'మగధీర" అత్యధిక సొమ్ము వసూలు చేసిన చిత్రంగా తెలుగు చిత్ర పరిశ్రమలో రికార్డు సాధించింది. మరి 'దూకుడు" ఫైనల్‌గా ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుందో కొన్ని రోజుల తర్వాతనే తెలుయనుంది.

    English summary
    Mahesh fans requested Producers to arrange Spl DOOKUDU Exp Trains. 'VSKP to BZA', 'TPTY to BZA' & 'SC to BZA'. He considered our request regarding DOOKUDU spl trains on Nov 11th n 12th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X