ప్రభాస్ ఫ్యాన్స్‌కు స్పెషల్ గిఫ్ట్.. దుబాయ్‌కి వెళ్తున్న యంగ్ రెబల్‌స్టార్

బాహుబలి2 విడుదలై ఆరు నెలలు అయిపోతున్నా ప్రభాస్ సినిమా ప్రేక్షకులను ఇంకా ఊరిస్తునే ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. ఈ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ ఇటీవలే పూర్తి చేసుకొన్నది. అయితే అక

By Rajababu

Recommended Video

Surprise B-Day Gift To Prabhas Fans దుబాయ్‌కి వెళ్తున్న రెబల్‌స్టార్

బాహుబలి2 విడుదలై ఆరు నెలలు అయిపోతున్నా ప్రభాస్ సినిమా ప్రేక్షకులను ఇంకా ఊరిస్తునే ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. ఈ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ ఇటీవలే పూర్తి చేసుకొన్నది. అయితే అక్టోబర్ 23న ప్రభాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమానులకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని చిత్ర యూనిట్ ఓ ప్రయత్నం చేస్తున్నది. ఆ గిఫ్ట్ ఏమిటంటే..

అక్టోబరు 23న ప్రభాస్‌ పుట్టినరోజు

అక్టోబరు 23న ప్రభాస్‌ పుట్టినరోజు

బాహుబలి2 రీలీజ్‌కు ముందు సాహో టీజర్ రిలీజ్ చేయగా దానికి అనూహ్య స్పందన వచ్చింది. కాగా అక్టోబరు 23న ప్రభాస్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులకు కానుకగా ప్రత్యేక వీడియోను విడుదల చేయనున్నట్టు సమాచారం.

ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్

ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్

సాహో చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్‌ నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్‌కి ప్రాధాన్యం ఇస్తూ భారీ బడ్జెట్‌తో తీస్తున్న ఈ సినిమా 2018లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సాహో చిత్రంలో పునర్జన్మ

సాహో చిత్రంలో పునర్జన్మ

అయితే సాహో చిత్రం పునర్జన్మ కథా నేపథ్యంగా రూపొందుతున్నట్టు సమాచారం. ఈ చిత్ర కథలో స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథ కూడా ఉంటుందట. ఇటీవలే స్వాత్రంత్రానికి పూర్వం జరిగిన సన్నివేశాలను తొలి షెడ్యూల్‌లో చిత్రీకరించినట్టు తెలిసింది.

కెన్నీ బెట్స్ పర్యవేక్షణలో

కెన్నీ బెట్స్ పర్యవేక్షణలో

సాహో రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ దుబాయ్‌లో జరుగుతుందట. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ పర్యవేక్షణలో భారీ పోరాట సన్నివేశాలను షూట్ చేయనున్నారట. రెండో షెడ్యూల్ నవంబర్ తొలివారంలో ప్రారంభమవుతుందట.

మరో సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్

మరో సినిమాకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్

‘సాహో' తర్వాత ప్రభాస్‌ మరో కథకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ‘జిల్‌' దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పారు. ఈ చిత్రాన్ని కూడా యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం జ్యోతిష్య శాస్త్రం, హస్త సాముద్రికం నేపథ్యంలో నడిచే కథ అని సమాచారం. 1985 కాలంలో జరిగినట్టుగా చూపిస్తారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X