»   » ‘బాహుబలి’ ప్రీమియర్ షో .. ఏయే స్టార్స్ ఛీఫ్ గెస్ట్ లు

‘బాహుబలి’ ప్రీమియర్ షో .. ఏయే స్టార్స్ ఛీఫ్ గెస్ట్ లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :‘బాహుబలి - ది బిగెనింగ్' ఫస్ట్ పార్ట్ ని జూలై 10న రిలీజ్ చెయ్యనున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్న ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయిటకు వచ్చాయి. ముఖ్యంగా ఈ చిత్రం బాలీవుడ్ ప్రీమియర్ గురించి ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


‘బాహుబలి' సినిమా హిందీ వెర్షన్ స్పెషల్ ప్రీమియర్ షోని జూలై 9వ తేదీన ప్లాన్ చేసారు. ఈ ప్రీమియర్ షో కి బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు. వీరితో పాటు మరికొంతమంది బాలీవుడ్ స్టార్ ప్రముఖులు కూడా ఈ స్పెషల్ ప్రీమియర్ షోకి హాజరు కానున్నారు. 


ఇక ఈ సినిమా హిందీ వెర్షన్ ని బాలీవుడ్ టాప్ డైరెక్టర్ మరియు నిర్మాత కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ చిత్ర టీం త్వరలోనే హై రేంజ్ ప్రమోషన్స్ చెయ్యడానికి వ్యూహ రచన చేస్తున్నారు. ఎంఎం కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ అందిచారు.


మరో ప్రక్క ఈ చిత్రం బిజినెస్ జోరందుకుంది. లెటెస్ట్ గా...బాలకృష్ణతో లెజండ్ నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ సాయి కొర్రిపాటి చేతికి ‘బాహుబలి' రైట్స్ వెళ్లాయి. రాజమౌళి సన్నిహితుడైన సాయి కొర్రపాటి బాహుబలి కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ హక్కులను పొందారు. ‘బాహుబలి'అన్ని వర్షన్‌లనూ ఆయనే కర్ణాటకలో విడుదల చేయనున్నారు. కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ హక్కులు కూడా మంచి ధరకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.


Special guests for Baahubali’s Hindi première

ఇక ఈ వేడుకతో,అంతకు ముందు వదిలిన ట్రైలర్ తో ఈ చిత్రానికి ఓ రేంజిలో క్రేజ్ వచ్చింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని కి విపరీతమైన క్రేజ్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.


USA థియోటర్ రైట్స్ ని తొమ్మిది కోట్లకు అంతుకు ముందే కొనుగోలు చేసిన బయ్యర్ 12 కోట్లు కు తిరిగి రీజనల్ డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేసినట్లు తెలుస్తోంది. అంటే 2.4 మిలియన్ డాలర్లుకు అన్నమాట. దానర్దం సినిమా రిలీజ్ కు ముందే మూడు కోట్లు లాభం చూసారన్నమాట. ఇంకా ఇలా ఎంతమందికి ఈ చిత్రం డబ్బులు పంట పండించనుందో అని అంతా ఎదురుచూస్తున్నారు.


ప్రస్తుతం యావత్ భారతదేశ సినీ పరిశ్రమ కళ్ళన్నీ బాహుబలి చిత్రం వైపే వున్నాయి. ఈ సినిమా దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.


ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మహాభారతమే తనకు స్పూర్తినిచ్చిందని తెలిపాడు. ఇదేకాదు దాదాపు తన సినిమాలన్నిటికీ రామాయణ, మహాభారతాలే స్పూర్తని చెప్పుకొచ్చాడు. ఈ రెండు ఇతిహాసాలతో తనకున్న అనుబంధమే దీనికి కారణమని తెలియజేసాడు. బాహుబలి పార్ట్ 1 జులై 10న మనముందుకు రానుంది. బాలీవుడ్ లో కరణ్ జోహార్ సమర్పిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తుంది.


భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే నెల 10న విడుదల చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.

English summary
Director Karan Johar is presenting the Baahubali in Hindi and he is making special plans for a grand première on the 9th of July.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu