'దూకుడు' పంక్షన్ కి వారే స్పెషల్ గెస్ట్ లు

By Srikanya

మహేష్‌ బాబు 'దూకుడు' విజయోత్సవాన్ని విజయవాడలో నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 12న వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ కార్యక్రమం జరుగుతోంది. దూకుడు నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపిచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వారు ఆ వివరాల్ని వెల్లడిస్తూ ''చిత్ర పరిశ్రమలో భారీ విజయంగా మా చిత్రం నిలిచింది. 350 కేంద్రాల్లో యాభై రోజులు పూర్తి చేసుకొంటుంది. వేడుకనీ ఆ స్థాయిలోనే చేస్తాం. ఈ కార్యక్రమానికి కృష్ణ, కె.రాఘవేంద్రరావు,పూరి జగన్నాథ్‌ ప్రత్యేక ఆహ్వానితులుగా వస్తారు. సినీ నటులు పలువురు హాజరవుతారు అన్నారు.

అలాగే ఈ చిత్రానికి ప్రజలు అఖండ విజయం అందించడం పట్ల ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసారు. ఇక ఒక్కడు తర్వాత మహేష్‌ బాబు పబ్లిక్ ఫంక్షన్‌లో పాల్గొనడం ఇదే అని చెప్పుకోవచ్చు. కృష్ణ, మహేష్‌ బాబు అభిమానులు ఈ ఉత్సవంలో భారీ ఎత్తున పాల్గొంటున్నట్లు తెలిసింది. అలాగే 60 కోట్ల నుంచి 80 కోట్ల రూపాయల వరకూ ఈ చిత్రం వసూలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకూ 'మగధీర" అత్యధిక సొమ్ము వసూలు చేసిన చిత్రంగా తెలుగు చిత్ర పరిశ్రమలో రికార్డు సాధించింది. మరి 'దూకుడు" ఫైనల్‌గా ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుందో కొన్ని రోజుల తర్వాతనే తెలుయనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X