twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి కొడుకు పెళ్లి: ఆ కోడ్ ఏంటో ఉపాసనకు తెలుసా.. 'బంగారం says ఎస్ఎస్' వైరల్!

    |

    దర్శక ధీరుడు రాజమౌళి తెరక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. నవంబర్ లో ఈ చిత్రం ప్రారంభమైంది. ఇప్పటికే రాజమౌళి ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసేశాడు. రానా తనయుడు కార్తికేయ వివాహం నేపథ్యంలో రాజమౌళి తదుపరి షెడ్యూల్ కి బాగా గ్యాప్ ఇచ్చాడు. రాజమౌళి కుటుంబం మొత్తం కార్తికేయ, పూజ వివాహం కోసం జైపూర్ వెళ్లారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా రాజమౌళి తనయుడి వివాహానికి హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాహానికి సంబంధించిన ఓ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    రాంచరణ్ సతీమణి

    రాంచరణ్ సతీమణి

    మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో ఓ ఫోటో ఫాస్ట్ చేస్తూ 'బంగారం సేస్ ఎస్ ఎస్' అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించింది. పెళ్లి వేడుకలో రాంచరణ్, రాజమౌళి సతీమణి రామా రాజమౌళి సెల్ఫీకి ఫోజిచ్చారు. ఈ ఫోటోని ఉపాసన ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఈ హ్యాష్ ట్యాగ్ ని ఉపయోగించింది. కొంతమంది సెలెబ్రిటీలు కూడా ఇదే హ్యాష్ ట్యాగ్ ఉపయోగిస్తున్నారు. దీని అర్థం ఏంటి అంటూనెటిజన్లు ఆరాతీస్తున్నారు.

    Poll:2018 ఉత్తమ తెలుగు చిత్రం Poll:2018 ఉత్తమ తెలుగు చిత్రం

    వైరల్ అవుతున్న హ్యాష్ ట్యాగ్

    నెటిజన్లు ఆ కోడ్ ని డీకోడ్ చేసే పనిలో ఉన్నారు. ఆ హ్యాష్ ట్యాగ్ అర్థం చాలా సింపుల్. కార్తికేయ తన ఫియాన్సీ పూజాని ముద్దుగా బంగారం అని పిలుస్తాడట. పూజా కూడా కార్తికేయని ఎస్ఎస్ అని ముద్దుగా పిలుస్తుందట. అందుకే బంగారం సేస్ ఎస్ఎస్ అనే హ్యాష్ ట్యాగ్ ని క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    సెలెబ్రిటీల వివాహాలకు ఇది కామనే

    సెలెబ్రిటీల వివాహాలకు ఇది కామనే

    సెలెబ్రిటీల వివాహాలకు అభిమానులు సోషల్ హంగామా చేస్తుంటారు. విరాట్, అనుష్క వివాహానికి విరుష్క, దీపికా, రణవీర్ వివాహానికి దీప్ వీర్, ప్రియాంక, నిక్ వివాహానికి నిక్యాంక హ్యాష్ ట్యాగ్స్ సందడి చేశాయి. ఇదే కోవలో బంగారం సేన్ ఎస్ఎస్ హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. కార్తికేయని వివాహం చేసుకోబోతున్న పూజ ప్రముఖ నటుడు జగపతి బాబు సోదరుడి కుమార్తె కావడం విశేషం.

    Poll: ఉత్తమ తెలుగు నటుడు 2018Poll: ఉత్తమ తెలుగు నటుడు 2018

    టాలీవుడ్ సెలెబ్రిటీలంతా

    టాలీవుడ్ సెలెబ్రిటీలంతా

    ఎన్టీఆర్, రాంచరణ్, ప్రభాస్, అనుష్క, నాని, రానా లాంటి టాలీవుడ్ సెలెబ్రిటీలంతా జోధ్ పూర్ లో జరగనున్న రాజమౌళి తనయుడి వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లారు. వివాహ వేడుకలో సెలెబ్రిటీలంతా డాన్స్ చేస్తూ సందడి చేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. రాజమౌళి తాను డాన్స్ చేస్తూ అందరిచేతా డాన్స్ చేయిస్తున్నాడు.

    English summary
    Special hashtag goes viral for Rajamouli sons wedding. Upasana tweets
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X