దాసరికి శోభన్‌బాబు స్వర్ణ కంకణం

By Srikanya

హైదరాబాద్ :ప్రముఖ నటుడు శోభన్‌బాబు జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏడాది తెలంగాణ సేవా సమితి, శ్రుతిలయ ఆర్ట్స్‌ అకాడమి సంయుక్తంగా పురస్కారాలను అందజేస్తోంది. ఈ ఏడాది ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావును శోభన్‌బాబు స్వర్ణకంకణ పురస్కారంతో సత్కరించనున్నారు. ఈనెల 10న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో వీటిని ప్రదానం చేస్తారు.

Special honour for Dasari Narayana Rao

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ''శోభన్‌బాబు మంచి నటుడే కాదు.. మంచి మనిషి. ఎప్పటికీ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయేలా చెరగని ముద్ర వేసుకొన్నాడు. అలాంటి వ్యక్తి పేరుమీద ఏర్పాటు చేసిన ఓ పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉంది''అని దాసరి తెలిపారు.

ఇదే వేదికపై నటుడు, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డికి శోభన్‌బాబు పురస్కారాన్ని అందజేస్తారు. ఈ కార్యక్రమం తెలంగాణ శోభన్‌బాబు సేవాసమితి, శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన జరగనుందని ఆ సంస్థ వ్యవస్థాపకులు పి.వి.శేషేందర్‌రావు, ఆమని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X