ఐటెం బ్యూటీ తమన్నా.. మిలమిల మెరుస్తున్న సోయగాలు.. కిక్కిచ్చిన సరిలేరు నీకెవ్వరు టీమ్
సూపర్ స్టార్ మహేష్ బాబు 26వ సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. షూటింగ్ చేస్తూనే సూపర్ స్టార్ అభిమానులు ఖుషీ అయ్యేలా అప్‌డేట్స్ ఇస్తూ వచ్చిన ఈ సినిమా దర్శకనిర్మాతలు.. తమన్నా పుట్టినరోజును పురస్కరించుకొని స్పెషల్ కిక్కిచ్చారు. ఈ సందర్బంగా ఐటెం బ్యూటీ తమన్నాకు స్పెషల్ విషెస్ తెలిపారు.

మిల్కీబ్యూటీ తమన్నా ఉండగా స్పెషల్ బ్యూటీ ఎందుకు?
ఒకప్పటిలా కాకుండా సినిమాల్లో కొత్తదనం తీసుకొస్తున్నారు మేకర్స్. హీరోయిన్లనే ఐటెం భామలుగా మార్చుతూ ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తున్నారు. అందాల తారలుండగా స్పెషల్ బ్యూటీస్ ఇంకెందుకు అన్నట్లుగా స్టార్ హీరోయిన్లతో ఐటెం స్టెప్స్ వేయిస్తున్నారు. మరోవైపు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్‌లో రెచ్చిపోయేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు'లో ఆయనతో చిందులేసేందుకు ఓకే చెప్పింది మిల్కీబ్యూటీ తమన్నా.

ఐటెం బ్యూటీ తమన్నా.. అదే ప్రత్యేకం
స్టార్ హీరోయిన్‌గా హవా సాగిస్తూనే అడపాదడపా స్టార్ హీరోస్ మూవీస్‌లో ఐటెం సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను మైమరిపిస్తోంది తమన్నా. హాట్ బ్యూటీగా సూపర్ అనిపించుకుంటోంది. ఈ బాటలోనే మహేష్ బాబుతో ఐటెం సాంగ్‌లో రెచ్చిపోయిందట తమ్మూ. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ ప్రత్యేకం కానుందట.

మిలమిల మెరుస్తున్న సోయగాలు
తమన్నా బర్త్ డే కానుకగా 'సరిలేరు నీకెవ్వరు' నుంచి ఆమె ఐటెం సాంగ్ లుక్ రివీల్ చేశారు. ఈ లుక్‌లో ఆర్మీ ప్యాంట్, స్పోర్ట్స్ వేర్ వేసుకుని తమ్మూ బేబీ ఫ్యాన్స్‌కి స్పెషల్ కిక్ ఇచ్చింది. ఇందులో తమన్నా సోయగాలు మిలమిల మెరుస్తూ యమ ఆకట్టుకుంటున్నాయి.

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ.. మిల్క్ బ్యూటీ చిందులు
‘ఆజ్ మేరా ఘర్ మే పార్టీ హై తు ఆజా మేరే రాజా' అనే లిరిక్స్‌తో తమన్నా స్పెషల్ సాంగ్ ఉండబోతోందని ఫిలింనగర్ టాక్.ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ సాంగ్ షూట్ చేశారట. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశారు. ఇందులో తమన్నా అందాలతో పాటు ఆమె చేసే డాన్స్ ఉర్రూతలూగించనుందని సమాచారం.

రష్మిక మందన్న, విజయశాంతి.. 'సరిలేరు నీకెవ్వరు'
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాతోనే వెండితెరకు రీ ఎంట్రీ ఇవ్వనుండటం విశేషం. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 11న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











