కొత్త గెటప్స్‌లో బాలకృష్ణ, సిమ్రన్
వై.వి.ఎస్. చౌదరి స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక భారీ చిత్రం ఒక్క మగాడు కోసం హీరో బాలకృష్ణ, నటి సిమ్రన్, దర్శకుడు చౌదరి, మేకప్ చీఫ్ శరత్ కుమార్ అమెరికా వెళ్లినట్టు తాజా సమాచారం. ఒక్క మగాడు సినిమాలో బాలకృష్ణ, సిమ్రన్ ప్రత్యేక గెటప్పులలో అలరించబోతున్నారు. ఇందుకోసం అమెరికా మేకప్ నిపుణుల సలహాలు, ఇంకా టెక్నికల్ విషయాలు అందుకునేందుకు ఈ యూనిట్ అమెరికా వెళ్లింది.
ఇదే విషయాన్ని అంతకుముందు వై.వి.ఎస్. చౌదరి వెల్లడిస్తూ - మంచి కథతో పాటు తెర మీద కనిపించే ఆర్టిస్టుల ఆహార్యం కూడా బావుండాలి. ఒక్క మగాడులో బాలకృష్ణ, సిమ్రన్ ప్రత్యేకంగా కనిపించబోతున్నారు. ఇందుకోసం నేను కొన్ని ఐడియాలు సిద్ధం చేశాను. సీనియర్ పబ్లిసిటీ ఆర్టిస్ట్ ఈశ్వర్ కొన్ని స్కెచ్‌లు వేశారు. ఈ స్కెచ్‌లకు హాలీవుడ్ నిపుణులు మాత్రమే న్యాయం చేయగలరని భావించి, వారి సలహాలు స్వీకరించడానికి వెళుతున్నాం అని చెప్పారు. లాస్ ఏంజెలెస్‌లో ఎక్స్‌పర్ట్ టెక్నీషియన్ల సేవలు ఉపయోగించుకుంటున్నాం. అక్కడ 15 రోజులు ఉండి, తిరిగొస్తాం. ఈ ప్రత్యేక గెటప్స్ కోసం అవసరమైన మేకప్ సామగ్రి కూడా మా వెంట తెచ్చుకుంటాం అని వివరించారు చౌదరి.
ఒక్క మగాడు చిత్రంలో బాలకృష్ణ సరసన సిమ్రన్‌తో పాటు నిషా కొఠారి, అనూష్క నటిస్తున్న సంగతి తెలిసిందే. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.


Click it and Unblock the Notifications