పవన్ కళ్యాణ్ 'పులి' గురించి కొత్త న్యూస్...
పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య రూపొందిస్తున్న కొమురం పులి చిత్రం తమిళంలో పులి గా రిలీజ్ కానుంది. అక్కడ ఎస్.జె.సూర్య దర్శకత్వంలో వస్తున్న చిత్రం అని హైలెట్ చేస్తూ పబ్లిసిటీ జరుగుతోంది. దాంతో అక్కడనుంచి మంచి ఆపర్స్ వస్తున్నట్లు సమాచారం. అందుకోసమే తమిళంలో యంగ్ సూపర్ స్టార్ చెప్పుకునే శింబుని ఈ చిత్రంలో ఓ సాంగ్ కోసం అడగటం జరిగింది.శింబు కూడా సంతోషంగా ఒప్పుకున్నాడని, అయితే డబ్బులు విషయంలో ఖచ్చితంగా ఉంటానని చెప్పినట్లు చెప్తున్నారు. అలాగే ఈ చిత్రం బడ్జెట్ ఇప్పటికి ఇరవై ఏడు కోట్ల రూపాయలు అయిందని తెలుస్తోంది. ఎఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో లండన్ కి చెందిన మోడల్ నిఖిషా పటేల్ చేస్తోంది.
పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో ఓ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నాడని, ఆ తర్వాత కథానుసారం పులి టీమ్ ఏర్పాటు చేసుకుని సమాన్యుడుకి న్యాయం చేస్తూ పోలీస్ డిపార్టమెంట్ లోనే ఉన్న విలన్ మనోజ్ వాపపేయని అంతమెందిస్తాడని చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో చరణ్ రాజ్, నాజర్, జ్యోతి కృష్ణ, బ్రమ్మాజి, గిరీష్ కర్నాడ్, అలీ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని మొదట విజయ్ తమిళంలో రీమేక్ చేయాలని ప్లాన్ చేసారు. అయితే స్టోరీ లైన్ మార్చాలని విజయ్ అడగటంతో ఆ ప్రపోజల్ మానుకుని డబ్బింగ్ వెర్షన్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో శ్రేయ ఐటం సాంగ్ చేస్తూ అలరించనుంది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యుజిక్ ని ఈ చిత్రానికి ఇస్తున్నారు. చెన్నై, హైదరాబాద్ లలో ఈచిత్రం షూటింగ్ ఎక్కువ భాగం జరిగింది. ఇక ఈ చిత్రాన్ని శింగనమల రమేష్ ప్రతిష్టాత్మకంగా భావించి చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











