మెగా మేనల్లుడి బర్త్ డే స్పెషల్ పోస్టర్.. ప్రతీ రోజూ పండగే

నేడు (అక్టోబర్ 15) మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు సినీ ప్రముఖులు. ఈ నేపథ్యం లోనే ఆయన తాజా సినిమా ప్రతీ రోజూ పండగే నుంచి కొత్త లుక్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ లుక్‌లో ఫుల్ గ్లామర్ గా కనిపిస్తూ మెగా అభిమానులకు స్పెషల్ కిక్ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్.

అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్‌పై తెరకెక్కుతోంది 'ప్రతీ రోజు పండుగే' మూవీ. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు బన్నీవాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ బాణీలు కడుతున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉండగానే సాయి ధరమ్ తేజ్ మామ మెగాస్టార్ చిరంజీవి కూడా పరిశీలించి ఓకే చేయడం విశేషం. దీంతో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీనికి తోడు తాజాగా వస్తున్న అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో ఆత్రుత పెంచేస్తున్నాయి.

Special Poster From Sai Dharam Tejs Prathi Roju Pangade

ఈ సినిమాలో సత్యరాజ్ మనవడిగా సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నాడు. వీరిద్దరి నడుమ సాగే కొన్ని ఎపిసోడ్స్ సినిమాకే హైలైట్ గా నిలవనున్నాయని టాక్. గత కొంతకాలంగా రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేశారు. మరికొద్ది రోజుల్లో యూనిట్ అంతా ఫ్లయిట్ ఎక్కనుంది. చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X